డబుల్ ట్రబుల్
డ్రగ్స్ ముఠా అరెస్టు కొత్త సంవత్సర వేడుకల కోసం హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వివరాలు 8లో u
డబుల్ బెడ్రూం ఇళ్లల్లోవెంటాడుతున్న సమస్యలు
● రవాణ, వైద్య, విద్య సదుపాయాలు ఆమడ దూరం ● సొంత నిధులతో నిర్వహణ ● మౌలిక సదుపాయాలు కల్పించాలనిస్థానికుల విజ్ఞప్తి
ఆదివారం శ్రీ 22 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
పాఠశాలను ఏర్పాటు చేయాలి
ఇక్కడ అన్ని మతస్తులకు ప్రార్థనా మందిరాలు, చిన్నారులకు పాఠశాలను ఏర్పాటు చేయాలి.
– జమీద్ ఖాన్, స్థానికుడు
ఆసుపత్రి ఏర్పాటు చేయండి
ఇక్కడ ఎక్కువగా సినీయర్ సిటిజన్‌లు ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. అత్యవసర సమయంలో ప్రవేట్ ఆసుపత్రులకు పోవాల్సి వస్తుంది. అధికారులు స్పందించి ఇక్కడ బస్తీదవఖానా ఏర్పాటు చేయాలి.
– దేవకృష్ణ, స్థానికుడు
ఇంటి నంబర్లను ఇస్తున్నాం
డబుల్ బెడ్రూమ్ నివాసులకు ఇంటి నంబర్లు కేటాయిస్తున్నాం. రోడ్లను శుభ్రం చేయిస్తున్నాం.
– సంగారెడ్డి,
మున్సిపల్ కమిషనర్ తెల్లాపూర్
రామచంద్రాపురం(పటాన్‌చెరు): గత ప్రభుత్వం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పేదలకు కేటాయించింది. అయితే వారు గృహప్రవేశం చేసినప్పటికీ సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక అలాగే గడిపేస్తున్నారు. కొల్లూరు డిగ్నిటీ కొల్లూరు–1లో 2052 ఇళ్లు ఉండగా అందులో 700 కుటుంబాలు ఇళ్లలోకి వచ్చాయి. కేసీఆర్ కాలనీలో 15,660 ఇళ్లుండగా అందులో సుమారు 3వేల కుటుంబాలు ఇళ్లలోకి వచ్చాయి. అయితే వీరికి అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం..
కేసీఆర్‌నగర్ కాలనీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. ఎక్కడి చూసినా మురుగు నీరు, చెత్త దర్శనమిస్తున్నాయి. దీంతో అంటురోగాలు ఎక్కడ వస్తాయోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తాగునీటి సమస్య ఇక్కడి వారిని తీవ్రంగా వేధిస్తోంది. డిగ్నిటీ కాలనీలో నీటి సిబ్బందికి చేతులు తడపాల్సివస్తోందని కాలనీవాసులు మండిపడుతన్నారు. త్రాగునీటి సంపుల చూట్టూ చెత్తపేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.
ఎక్కడ చూసినా లీకేజీలే..
డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. పైన ఫ్లోర్‌కు చెందిన డ్రైనేజీ నీరు కిందింటి వారి గోడలకు వచ్చిచేరుతోంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుకెళ్లినా వారు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా వారే ఇళ్లకు మరమ్మతులు చేసుకుంటున్నారు. కరెంట్,నాలాలు, ఇంటి ఫ్లోరింగ్ పనులకు డబ్బులను ఖర్చు చేసుకుంటున్నారు. కొల్లూరు డిగ్నిటీ హౌసింగ్ కాలనీ వాసులైతే తమ సొంత నిధులతో ప్రతీ బ్లాక్‌కు ఒక వాచ్‌మ్యాన్, సెక్యూరిటీ గార్డ్‌లను, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్, సీసీకెమేరాలు ఏర్పాటు చేసుకున్నారు. చెత్త తొలగించేందుకు నెలకు రూ. 20వేలు ఖర్చుచేస్తున్నారు.
రోడ్లపైనే దుకాణాలు..
ఇళ్ల సముదాయంలో దుకాణాలను ఎవరికీ కేటాయించకపోవడంతో అక్కడి చిరువ్యాపారస్తులు రోడ్లపై, ఇళ్ల సముదాయంలో చిన్న చిన్న దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. అధికారుల స్పందించి దుకాణాలను కేటాయించడంతోపాటు సంతకు స్థలాన్ని కేటాయించాలని కోరుతున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఇక్కడి నివాసులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. వేలాది కుటుంబాలు నివాసం ఉంటున్న ప్రాంతానికి రవాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో ఆస్పత్రి, పాఠశాల, పార్కు, ప్రార్థన మందిరాలు, పోలీస్‌స్టేషన్, ఫంక్షన్‌హాల్ లాంటి సౌకర్యాల కోసం భూమిని కేటాయించారు. వేలాది కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నా అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించడంలేదు. దాంతో స్థానికులు వైద్యం కోసం దూరప్రాంతాలకు పోవాల్సిన పరిస్థితి నెలకొంది.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment