ఆకట్టుకుంటున్న హస్తకళా మేళా
● చేనేత మేళాలో వివిధ వస్తువులు ● బారులు తీరుతున్న జనాలు
సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణంలో చేనేత హస్త కళా మేళా పట్టణ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పట్టణంలోని టీటీడీలో ఏర్పాటు చేసిన ఈ మేళాలో వివిధ కాల చేనేత వస్తువులు అందుబాటులో ఉంచారు. పోచంపల్లి వస్త్రాలను, నారాయణపేట, గద్వాల, వరంగల్, ఉప్పాడ, కంచి, ధర్మవరం, సిద్దిపేట, వెంకటగిరి చీరలు, కాటన్ చీరలు, పట్టు వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్, టవల్స్, కాటన్ ప్రింటెడ్ చీరలు, దుప్పట్లు వంటివి అందుబాటులో ఉన్నాయి. దేశంలో పేరొందిన హస్త కళా వస్తువులైన కొండపల్లి, ఏటికొప్పాక, నిర్మల్ బొమ్మలు, మైసూర్ రోజ్‌వుడ్ వస్తువులు, వరంగల్ లెదర్స్, బంజారా ఎబ్రాయిడరీ, హైదరాబాద్ మంచి ముత్యాలు, హైదరాబాద్ బ్యాంగిల్స్, చెక్క వస్తువులు, బ్లాక్ మెటల్స్, పెంబర్తి, ఇత్తడి వస్తువులు, ఖాదీ గ్రామోద్యోగ్, హెర్బల్ ఉత్పత్తులు, మైసూర్ అగర్‌బత్తి, బెంగాలీ జూట్ బ్యాగులను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. పండుగ సమయం కావడంతో మేళాను చూసేందుకు ప్రజలు తరలిరావడంతో కిటకిటలాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment