ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాలి
జోగిపేట(అందోల్): తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ప్రిన్సిపాల్‌ను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా అందోల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు శనివారం ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ సద్గుణ మేరీగ్రేస్‌ను బదిలీ చేయాలని, ఆమెను పాఠశాల నుంచి బయటకు పంపించేంతవరకు తాము లోనికి వెళ్లేది లేదని పాఠశాల గేట్ ముందు విద్యార్థినులు రెండుగంటల సేపు బైఠాయించారు. దీంతో విషయం తెలుసుకున్న అందోల్–జోగిపేట ఆర్డీవో పాండు, డిప్యూటీ తహసీల్దారు మధుకర్‌రెడ్డి, సీఐ అనిల్‌కుమార్ పాఠశాలకు చేరుకుని విద్యార్థినులకు నచ్చజెప్పారు. అయినప్పటికీ వారు ఆందోళన విరమించకపోవడంతో ఆర్డీఓ పాండు ఉన్నత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెప్పడంతో బాలికలు ఆందోళన విరమించి తరగతులకు హాజరయ్యారు.
అదనపు కలెక్టర్ విచారణ
విద్యార్థినుల ఆందోళన విషయం తెలుసుకున్న కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రిన్సిపాల్ మేరీగ్రేస్ వ్యవహార తీరుపై విచారణకు ఆదేశించారు. దీంతో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ విద్యార్థినులతో సమావేశం నిర్వహించి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియ ఆందోళన చేపట్టామని అదనపు కలెక్టర్‌కు విద్యార్థినులు వివరించారు.
లెక్కలంటే భయం వద్దు
అర్థం చేసుకుంటే సులభమంటున్న నిపుణులు విద్యార్థులతో మమేకవుతూ వైవిధ్యంగా బోధన పట్టికలు, చార్ట్‌లు, ప్రదర్శనలతో అవగాహన వినూత్న ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తున్న విద్యార్థులు నేడు జాతీయ గణిత దినోత్సవం
8లో
అర్థం చేసుకుంటే చాలా సులువు.. మిస్టరీ అంతకంటే కాదు.. నేర్చుకుంటే చాలా ఈజీ.. అదే గణితం. లెక్కలు అనగానే విద్యార్థుల్లో ఏదో తెలియని భయం. పరీక్షలు అనగానే ఆత్మనూన్యతా భావం. గణితం అంటే భయమా..? అంటే కాదనే చెబుతున్నారు గణిత నిపుణులు. ప్రముఖ గణితవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణితంలో రాణిస్తున్న విద్యార్థులు, సులభంగా అర్థమయ్యేలా బోధిస్తున్న ఉపాధ్యాయులు, సైన్స్ ఫెయిర్లలో జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థుల ప్రాజెక్ట్‌లపై ఈ వారం ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
అందోల్ గురుకుల పాఠశాలవిద్యార్థినుల ఆందోళన
తమతో వెట్టి చాకిరీచేయించుకుంటున్నారని ఫిర్యాదు
గేట్‌ముందు బైఠాయింపు
Comments
Please login to add a commentAdd a comment