టమాఠా.
ధర ఢమాల్.. కిలో రూ.5
● దిక్కుతోచని స్థితిలో రైతులు ● కూలీ డబ్బులు కూడా రావట్లేదంటూ ఆవేదన
చిన్నకోడూరు(సిద్దిపేట): నిన్నమొన్నటి వరకు మంచి ధర పలికిన టమాటా అమాంతంగా పడిపోయింది. రోజు రోజుకు పతనం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మొన్నటి వరకు కిలో 20– 30 ధర పలికగా.. నేడు మార్కెట్‌లో రూ.5 పడిపోయింది. ఆరుగాలం కష్టపడి ఆటుపోట్లు ఎదుర్కొని పండించిన పంట అమ్మితే రవాణా ఖర్చులు.. కూలీ డబ్బులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నకోడూరు మండలంలోని మాచాపూర్, మెట్‌పల్లి, మల్లారం, విఠలాపూర్, చౌడారం, మేడిపల్లి గ్రామాల్లో సుమారు 500 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నారు. ఎకరా టమాటా పంట సాగుకు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. తెగుళ్లు సోకితే అదనంగా భారం పడుతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుని పంట పండిస్తే పంట చేతికి వచ్చాక మార్కెట్‌లో అమ్ముదామంటే కనీస మద్దతు ధర లభించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆదాయం అంతంతే..
ప్రస్తుతం మార్కెట్‌లో 20 కిలోల పెట్టే ధర రూ.100 పలుకుతోంది. ఎకరం సాగుకు రూ. 30 వేల వరకు ఖర్చు అవుతుంది. టమాటా తెంపడానికి ఒక్కో కూలీకి రోజుకు రూ. 300–400 వరకు ఇస్తున్నామని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో అమ్మితే కూలీ, రవాణా ఖర్చు రావడం లేదు. పంటకు తెగుళ్లు రాకుండా జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడులు పెట్టి సాగు చేస్తే సరైన ధర లేదని రైతులు బాధపడుతున్నారు.
పెట్టుబడి రావడం లేదు..
అన్ని జాగ్రత్తలు తీసుకుని టమాటా పండిస్తే చేతికందే సమయంలో ఽమార్కెట్‌లో ధర లేదు. దీంతో కూలీ, రవాణా డబ్బులు కూడా రావడం లేదు. చాలా మంది రైతులు పంట చేనులోనే వదిలేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మద్దతు ధర కల్పించే విధంగా చూడాలి.
– తిరుపతి రెడ్డి, రైతు మల్లారం
Comments
Please login to add a commentAdd a comment