రాజ్యాధికారంతోనే హక్కుల సాధన
శివ్వంపేట(నర్సాపూర్): రాజ్యాధికారంతోనే మన హక్కులు సాధించుకునేందుకు అవకాశం ఉంటుందని పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లకాటి రాజ్‌కుమార్ అన్నారు. గురువారం మండల పరిధి దంతన్‌పల్లి గ్రామంలో పద్మశాలీ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సంఘం కేలండర్ ఆవిష్కరించడంతో పాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొంది సత్తా చాటాలన్నారు. హైదరాబాద్‌లో పద్మశాలీ విద్యార్థుల కోసం హాస్టల్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు మ్యాకల జయరాములు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వేముల బాల్‌రాజ్, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు గజేంద్రుల నర్సింలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పామల వెంకటేశం, శంకర్, శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి వడిచర్ల మారుతీ, కోశాధికారి సర్గం వెంకట్ నారాయణ, శివ్వంపేట, వెల్దుర్తి మండల అధ్యక్షులు బొడ్డు భిక్షపతి, గజం వెంకటేశం, జిల్లా నాయకులు వీరేశ్, నర్సింలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment