లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
గజ్వేల్‌రూరల్: లారీని వెనుక నుంచి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఢీకొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ రింగురోడ్డు వద్ద బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. గజ్వేల్ పోలీసులు, జీపీపీ ఆర్టీసీ డిపో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ ఆర్టీసీ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఎక్స్‌ప్రెస్ బస్సు 20 మంది ప్రయాణికులతో జేబీఎస్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తుంది. ఈ క్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ రింగురోడ్డు దిగిన తర్వాత రిమ్మనగూడ సమీపంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం దెబ్బతినగా డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు లోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ సైదా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment