కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా
శివ్వంపేట(నర్సాపూర్) : టాటా ఏస్ ట్రాలీ బోల్తా పడి మహిళా కూలీలకు గాయాలైన ఘటన గురువారం చిన్నగొట్టిముక్ల– గోమారం ప్రధాన రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధి చిన్నగొట్టిముక్ల గ్రామానికి చెందిన 20 మంది మహిళలు గుమ్మడిదల మండలం లక్ష్మాపూర్ వద్ద కస్టోడియం భూములు చదును చేసుకునేందుకు టాటా ఏస్ ట్రాలీ ఆటోలో వెళ్తున్నారు. ఆటోలో అధిక సంఖ్యలో ఎక్కడంతో మార్గమధ్యలో టిక్యదేవమ్మగూడం గ్రామ పంచాయతీ పరిధిలో ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మధిర పెంటమ్మ, కమల, గుమ్మడి పెంటమ్మ, పానుగాటి మాణెమ్మ, షేక్ షమిన్‌కు తీవ్ర గాయాలు కాగా సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే, మధిర నాగమణి, కర్రె రాములమ్ము, కర్రె హంసమ్మ, షేక్ హసీనా, జలీనా, రిజ్వనా, నువ్యుల అనితతోపాటు మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మరికొంత మంది శివ్వంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా క్షతగాత్రులను నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి గురువారం రాత్రి పరామర్శించారు. ఆయన వెంట పార్టీ నాయకులు నవీన్ గుప్తా, గణేష్ తదితరులు ఉన్నారు.
ఐదుగురికి తీవ్ర, మరో పది మందికి
స్వల్పగాయాలు
Comments
Please login to add a commentAdd a comment