ఉద్యాన సాగు వైపు దృష్టి సారించాలి
ములుగు ఉద్యాన వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డాక్టర్.రాజిరెడ్డి
ములుగు(గజ్వేల్): రైతులు మొక్కజొన్న, పత్తి, వరి పంటలకే పరిమితం కాకుండా ఉద్యాన పంటల సాగు వైపు దృష్టి సారించాలని ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్. దండ రాజిరెడ్డి పేర్కొన్నారు. సికింద్రాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో గురువారం నిర్వహిస్తున్న ఉద్యాన ఉత్సవ్ కార్యక్రమానికి ఉద్యాన విశ్వవిద్యాలయం కింద పని చేస్తున్న కృషి విజ్ఞాన కేంద్రం పెద్దపల్లి జిల్లా నుంచి తరలివెళ్తున్న రైతుల వాహనాన్ని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన కూరగాయలు మన ఊరికే ఆ తర్వాతే బయటి మార్కెట్‌కు తరలించాలనే ధోరణిలో రైతులు ముందుకు సాగాలన్నారు. మన ఊరు–మన కూరగాయలు కార్యక్రమాన్ని ఫైలెట్ ప్రాజెక్ట్‌గా చేపట్టాలని సూచించారు. ఉద్యానవన సాగు రైతులుకు మేలన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు విజయ, కృషి విజ్ణాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఉద్యాన శాస్త్రవేత్త భాస్కర్‌రావు, విస్తరణ విభాగం శాస్త్రవేత్త వినోద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment