దుబ్బాకటౌన్: బీఆర్‌ఎస్ నాయకురాలైన కత్తి కార్తీకను కాంగ్రెస్ మహిళా నాయకులు వ్యక్తిగతంగా దూషించడం సహించబోమని మున్సిపల్ చైర్‌పర్సన్ గన్నె వనిత మండిపడ్డారు. సోమవారం బీఆర్‌ఎస్ క్యాంప్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ మహిళలు, నాయకులపై అనుచిత వాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు లలిత, యాదగిరి, స్వామి, శ్రీనివాస్, రాజలింగం, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
బహిరంగంగా క్షమాపణ చెప్పాలి
సిద్దిపేటజోన్: బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక, మాజీ మంత్రి హరీశ్‌రావును విమర్శించే స్థాయి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మికి లేదని, వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ మహిళ విభాగం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం హరీశ్‌రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సువర్ణ లక్ష్మి, నర్సమ్మ, నాగమ్మ, సునీత మాట్లాడారు. సాటి మహిళను విమర్శించడం సబబు కాదన్నారు.