మినీ సిలిండర్లు బహిరంగంగా విక్రయాలు | Sakshi
Sakshi News home page

మినీ సిలిండర్లు బహిరంగంగా విక్రయాలు

Published Tue, Apr 16 2024 6:45 AM

హుస్నాబాద్‌లో మినీ గ్యాస్‌ సిలిండర్లు
విక్రయించే షాప్‌లో సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లు  - Sakshi

పట్టణ, మండల కేంద్రాలలో మినీ గ్యాస్‌ సిలిండర్ల విక్రయాలు బహిరంగంగానే ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్‌లోని గ్యాస్‌ను రీ ఫిల్లింగ్‌ చేసి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నారు. జనావాసాల మధ్య అక్రమ దందా నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోకపోవడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మినీ సిలిండర్లను వినియోగించవద్దని, రీ ఫిల్లింగ్‌ చేసే సమయంలో ప్రమాదం పొంచి ఉందని తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
Advertisement