ప్రేమ వివాహం చేసుకున్నారని.. | - | Sakshi
Sakshi News home page

ప్రేమ వివాహం చేసుకున్నారని..

Published Sat, Oct 19 2024 7:18 AM | Last Updated on Sat, Oct 19 2024 1:12 PM

ప్రేమ వివాహం చేసుకున్నారని..

ప్రేమ వివాహం చేసుకున్నారని..

దుబ్బాకటౌన్‌: ప్రేమ వివాహం చేసుకున్నారని యువకుడి ఇంటిపై యువతి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రాయపోల్‌ మండలం టెంకంపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. టెంకంపేటకు చెందిన కోరే మల్లేశం కుమారుడు కోరే నవీన్‌, అదే గ్రామానికి చెందిన యువతిని కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నారు. వీరిద్దరూ గురువారం రాత్రి యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. 

విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు శుక్రవారం తెల్లవారుజామున కోరే మల్లేశం ఇంటిపై దాడి చేశారు. ఇంటిపై సిమెంట్‌ రేకులు, పెంకులను ధ్వంసం చేశారు. మీ కుమారుడిని ఎక్కడికి పంపించారో చెప్పాలంటూ మల్లేశంపై సైతం దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టారు. దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బాధితుడు మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ కృష్ణంరాజు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement