పరిహారం చెల్లిస్తేనే సర్వేకు సహకరిస్తాం
అక్కన్నపేట(హుస్నాబాద్): తమకు రావాల్సిన పరిహారం చెల్లిస్తేనే కులగణన సర్వేను సహకరిస్తామని గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు తేల్చి చెప్పారు. అక్కన్నపేట మండలం కపూర్‌నాయక్‌తండా గ్రామ పరిధిలో శ్రీరామ్‌తండా భూ నిర్వాసితులందరూ సర్వేలో పాల్గొనకుండా బహిష్కరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం తహసీల్దార్ ఆనంతరెడ్డి, ఎంపీడీఓ భానోతు జయరాం, సీడీపీఓ జయమ్మ, ఎంపీఓ గుగులోతు మోహన్‌నాయక్ శ్రీరామ్‌తండాకు వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు భూ నిర్వాసితులు మాట్లాడారు. తాము నిర్మించుకున్న ఇళ్లకు ఇంటి అనుమతులు, నంబర్లు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రాజెక్టులో ముంపునకు గురైన భూములు పోగా మిగిలిన భూములుకు పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఇండ్ల స్థలాలకు పరిహారం రావల్సి ఉందన్నారు. మా సమస్యలను పరిష్కరించేలా మంత్రి పొన్నం, కలెక్టర్ మనుచౌదరి సృష్టమైన హామీ ఇస్తేనే సర్వేకు సహకరిస్తామన్నారు. దీంతో చేసేదిలేక అధికారులందరూ వెనుదిరిగి వెళ్లిపోయారు.
‘గౌరవెల్లి’ నిర్వాసితుల స్పష్టీకరణ
వెనుదిరిగిన తహసీల్దార్, ఎంపీడీఓ
Comments
Please login to add a commentAdd a comment