ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, హేతుబద్ధమైన సత్యాన్ని ప్రబోధించే విలువలు గల సమాజం ఏర్పడాలంటే గౌతమ బుద్ధుడు సూచించిన మార్గంతోనే సాధ్యమవుతుందని బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి శీలం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భారత బౌద్ద మహాసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ మతం అనేది మార్పునకు అనుగుణంగా, నీతిని ప్రభోదించేదిగా ఉండాలి. సమత, కరుణ, ప్రజ్ఞను ప్రబోధించిన మార్గదర్శకుడు బుద్ధుడు అన్నారు. అనంతరం బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడు ఎనగందుల శంకర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉప్పర పద్మ,రేణుక, ప్రధాన కార్యదర్శి నర్సింలు, కార్యదర్శులు వాగ్మారే సునీత, వేముల ప్రసన్న, కోశాధికారి మన్నె సాయి బాబా, కార్యవర్గ సభ్యులు తదిరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment