గజ్వేల్‌లో ఆర్‌ఏఎఫ్ ఫ్లాగ్ మార్చ్
గజ్వేల్‌రూరల్: శాంతిభద్రతల పరిరక్షణే తమ కర్తవ్యమని గజ్వేల్ సీఐ సైదా పేర్కొన్నారు. భారత హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌లోని భాగమైన ఆర్‌ఏఎఫ్ (రాపిడ్ యాక్షన్ ఫోర్స్)తో శనివారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్ నుంచి ఇందిరాపార్కు చౌరస్తామీదుగా కోటమైసమ్మ నుంచి పిడిచెడ్ రోడ్డు గుండా పోలీస్‌స్టేషన్ వరకు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ టీవీ బగేల్, ఇన్‌స్పెక్టర్లు హరిబాబు, మల్లేశ్వర్‌రావు, తొగుట సీఐ లతీఫ్, గజ్వేల్ ఎస్‌ఐలు యాదవరెడ్డి, శంకర్, ఆర్‌ఏఎఫ్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వ్యసనాలకు బానిస కావద్దు
యువత చెడు వ్యసనాలకు బానిసలు కావద్దని గజ్వేల్ సీఐ సైదా సూచించారు. ఇన్‌స్పైర్ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్ హబ్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో మోటివేషనల్ స్పీకర్ నళినితో కలసి సైదా మాట్లాడారు. యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మత్తు పదార్థాల పేరుతో క్రయవిక్రయాలు జరిపినా, వాటిని స్వీకరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్‌గౌడ్, ఇన్‌స్పైర్ గ్లోబల్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ వినోద్, జనరల్ సెక్రటరీ కరుణాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment