గ్యాస్ ఏజెన్సీల లైసెన్స్‌లు రద్దు చేయాలి
హుస్నాబాద్: ప్రభుత్వం ద్వారా పేదలకు ఇవ్వాల్సిన సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు అమ్ముకుంటున్న గ్యాస్ ఏజెన్సీల లైసెన్స్‌లను రద్దు చేయాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్‌చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్కన్నపేట మండలానికి చెందిన గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. తమ మండలంలోని హుస్నాబాద్‌తో పాటు వివిధ గ్రామాల్లో సిలిండర్ పై రూ.100లను అదనంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌కు రూ.2వేల చొప్పున అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి అక్రమ దందాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రవీందర్ గౌడ్ డిమాండ్ చేశాడు. సమావేశంలో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు వెల్పుల రాజు నాయకులు శంకర్, సుధాకర్, హన్మంత్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment