నేటి ప్రజావాణి రేపటికి వాయిదా..
సిద్ధిపేటరూరల్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల మంగళవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి ప్రజావాణి కార్యక్రమానికి రావాలనుకునే వారు మంగళవారం వచ్చి సమస్యల పరిష్కారానికి అర్జీలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు.
సమాజ హితమే
పద్య సాహిత్యం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సమాజ హితమే పద్య సాహిత్యమని, సమాజాన్ని మేల్కొల్పే పద్యం చిరస్థాయిగా నిలుస్తుందని జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐతా చంద్రయ్య అన్నారు. సిద్దిపేట శాఖ గ్రంథాలయం ఆవరణలో ఆదివారం జరిగిన సమావేశంలో ప్రముఖ కవి బండకాడి అంజయ్య గౌడ్ రచించిన ‘‘అనఘు శతక’’ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐతా చంద్రయ్య మాట్లాడుతూ దేశం బాగుపడాలంటే సంస్కృతి సంప్రదాయ రచనలు కావాలన్నారు. పద్య సాహిత్యం పాఠ్యపుస్తకాల్లో అందించి బాలలకు పద్య వైభవం అందించాలన్నారు. కార్యక్రమంలో జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఎన్నవెల్లి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం, వర్కోలు లక్ష్మయ్య, కోణం పరశురాములు, బస్వరాజ్ కుమార్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
సుజాతకు
బెస్ట్ రచయిత్రి అవార్డు
దుబ్బాక: మున్సిపల్ పరిధిలోని లచ్చపేటకు చెందిన ఎర్రగుంట సుజాతకు బెస్ట్ రచయిత్రి అవార్డు ప్రదానం చేశారు. రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ సౌజన్యంతో జీసీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డు అందజేశారు. మాదక ద్రవ్యాలు–వాటి నిర్మూలన అంశంపై రచయిత్రి ఎర్రగుంట సుజాత రాసిన రచనకు అవార్డు వరించింది. ఎమ్మెల్సీ కోదండరాం, జీసీఎస్ ఫౌండేషన్ బాధ్యుల చేతుల మీదుగా అవార్డుతో పాటు ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించారు.
గణితం టాలెంట్ టెస్ట్‌లో
విద్యార్థుల హవా
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా నగరంలోని హయత్‌నగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గణిత టాలెంట్ టెస్ట్‌లో సిద్దిపేట విద్యార్థులు ప్రఽథమ, ద్వితీయ స్థానాలలో రాణించారని టీఎంఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్‌రెడ్డి తెలిపారు. నారాయణరావుపేట మండలం జక్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని సౌమ్య 60కి 58 మార్కులు సాధించి ప్రథఽమ బహుమతి పొందారన్నారు. సిద్దిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్‌కు చెందిన విద్యార్థి వంశీతేజ 60కి 56 మార్కులు సాధించి ద్వితీయ బహుమతి సాధించారన్నారు. వీరిద్దరికీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ గాజర్ల రమేష్‌ల చేతులమీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment