మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వివిధ ప్రాతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. గంగరేణి చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన ఉన్న ఎల్లమ్మ తల్లి కి బోనాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో స్వామి వారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
– కొమురవెల్లి (సిద్దిపేట)
‡
‡
Comments
Please login to add a commentAdd a comment