ఫీజు రీయింబర్స్‌మెంట్ ఘనత ఏబీవీపీదే..
ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ విద్యార్థులకు సమస్య ఉన్నచోట ఏబీవీపీ ఉంటుందన్నారు. పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం నాటి ముఖ్యమంత్రి వైఎస్సాఆర్‌తో మాట్లాడి సాధించామన్నారు. నేడు ఎంతో మంది చదువులకు ఇది తోడ్పడుతోందన్నారు. పదేళ్లుగా ప్రజలను విస్మరించిన గత ప్రభుత్వాని గద్దె దించేందుకు ఏబీవీపీ పోరాడిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. అంతకు ముందు చిన్నారుల సాంస్కృతి కార్యక్రమాలు, కళాకారులు డప్పుచప్పుళ్లతో అలరించారు. కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, సామాజిక సమరసత వేదిక కన్వీనర్ ప్రసాద్, ఏబీవీపీ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొనానరు.
Comments
Please login to add a commentAdd a comment