భావి భారత కర్షకులు..
గణిత సూత్రాలే రంగవల్లులై..
జిల్లాలోని పలు పాఠశాలల్లో సోమవారం రైతు దినోత్సవం కనులపండువగా సాగింది. విద్యార్థులు రైతు వేషధారణలో అలరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల సిబ్బంది కలిసి వ్యవసాయ పనులు చేస్తున్న రైతుల దగ్గరికి వెళ్లారు. రైతు ప్రాముఖ్యత, వ్యవసాయం గురించి అవగాహన కల్పించారు. రైతు లేనిదే దేశం లేదని, రైతే రాజు అని విద్యార్థులకు వివరించారు. అనంతరం రైతులను శాలువాలతో సన్మానించారు.
– చేర్యాల/దుబ్బాక టౌన్
చేర్యాల: రైతుల
వేషధారణలో చిన్నారులు
దుబ్బాక టౌన్: నాగలి
ఎత్తుకున్న విద్యార్థి
సుందరంగా కరుణామయుడి కోవెల
ఏసయ్య మందిరం క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ చర్చిని రంగురంగుల విద్యుత్‌దీపాలతో అలంకరించారు.
వర్గల్(గజ్వేల్): గణిత సూత్రాలే రంగవల్లులయ్యాయి. గణిత శాస్త్ర ప్రాముఖ్యత చాటుతూ అనేక ఆకృతులు ఆవిష్కృతమయ్యాయి. జాతీయ గణిత దినోత్సవ వేడుక పురస్కరించుకుని సోమవారం ‘గణిత రంగోలి’ కార్యక్రమానికి వర్గల్ మహాత్మ జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాల వేదికై ంది. గణిత శాస్త్ర ప్రాముఖ్యత చాటుతూ కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు తీర్చిదిద్దిన గణిత ముగ్గులు ఆకట్టుకున్నాయి. ప్రతిభ చాటిన విద్యార్థినులకు ప్రిన్సిపాల్ గడ్డం భాస్కర్‌రావు బహుమతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment