ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలోని మైనార్టీ నిరుద్యోగులకు వెబ్ యాప్ డెవలప్‌మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి షేక్ అహ్మద్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు మూడు నెలల పాటు 60మందికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 31లోగా జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రైవేటు ఆస్పత్రులు
నిబంధనలు పాటించాలి
డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్
సిద్దిపేటకమాన్: ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు డీఎంహెచ్‌ఓను సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్, పీసీపీఎన్‌డీటీ యాక్ట్ అనుసరించి ప్రైవేటు ఆస్పత్రులు రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేసుకోవాలన్నారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. చట్టవ్యతిరేకంగా పని చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టీజీసీటీఏ అకాడమిక్
కార్యదర్శిగా సుదర్శనం
సిద్దిపేటఎడ్యుకేషన్: డిగ్రీ కళాశాలల అధ్యాపక సంఘం (టీజీసీటీఏ) రాష్ట్ర అకాడమిక్ కార్యదర్శిగా సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గోపాల సుదర్శనం ఎన్నికయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్‌లో ఇటీవల నిర్వహించిన టీజీసీటీఏ నాలుగవ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో నూతన కార్యవర్గాన్ని ఏన్నుకున్నారు. సోమవారం స్థానిక కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, అధ్యాపకులు సుదర్శనంను అభినందించారు. సుదర్శనం మాట్లాడుతూ అకాడమిక్ ఆడిట్, నాక్ మదింపు, అటానమస్ ప్రతిపాదనలు తదతర అంశాల్లో నిర్మాణాత్మక సూచనలు అందించి డిగ్రీతో పాటు ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు.
ఉత్సవ మూర్తుల దర్శనం
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్నస్వామి ఆలయంలో భక్తులకు ఉత్సవ మూర్తుల దర్శనం కల్పించారు. ఈ నెల 29న మల్లికార్జున స్వామి కల్యాణం జరగనుండటంతో మూల విరాట్టుకు రంగులు వేయనున్నారు. దీంతో స్వామివారి నిజరూప దర్శనం ఆదివారం సాయంత్రం నుంచి ఆలయ అధికారులు నిలిపివేశారు. సోమవారం ఉదయం నుంచి స్వామివారి అర్థ మండపంలో ఉత్సవ మూర్తుల దర్శనాన్ని కల్పించారు.
నేడు సైక్లింగ్ ఎంపిక
పోటీలు
అక్కన్నపేట(హుస్నాబాద్): మండల పరిధిలోని అంతక్కపేటలో మంగళవారం అక్కన్నపేటలో ఉమ్మడి మెదక్ జిల్లాస్థాయి సైక్లింగ్ ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అండర్ 14, 17 బాలబాలికల విభాగంలో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరించిన వారిని ఈ నెల 27న రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు పంపిస్తామన్నారు. సైక్లింగ్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు తప్పకుండా సొంత సైకిల్, హెల్మెట్‌తో పాటు జనన ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలన్నారు. పోటీల్లో పాల్గొనాలనే ఆసక్తిగల క్రీడాకారులు తమ పేర్లను అక్కన్నపేట ఎస్‌జీఎఫ్ కార్యదర్శి జంగపల్లి వెంకటనర్సయ్యకు అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు 9441925763, 85,22,821102 నంబర్లను సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment