నూతనత్వం
అన్ని దారులూ సిద్దిపేట వైపే.. ఎటు చూసినా ఏబీవీపీ కార్యకర్తలే.. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివస్తూ.. ఏకత్వంలో నూతనత్వం చాటుతూ.. జెండాలు చేతబూని విద్యార్థి లోకం కదిలింది. సోమవారం సిద్దిపేటలో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సభ స్థలి వద్ద ఒగ్గు, డప్పు, నృత్య కళాకారులు. విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారతమాతాకి జై.. జై భవానీ.. వీర శివాజీ నినాదాలతో మహాసభల సభా ప్రాంగణం మార్మోగింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు.
ఏకత్వం..
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఏబీవీపీ రాష్ట్ర మహాసభలకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ మహాసభల తొలిరోజు సుమారు 3 వేల మంది కార్యకర్తలు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10.57 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. గవర్నర్‌కు కలెక్టర్ మనుచౌదరి, ఇన్‌చార్జి సీపీ అఖిల్ మహాజన్‌లు ఘన స్వాగతం పలికారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఉదయం 11.42గంటలకు మహాసభల సభాస్థలికి గవర్నర్ చేరుకున్నారు. జాతీయ గీతాలపన గావించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభలను ప్రారంభించారు. గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ మాట్లాడుతూ విద్యార్థి శక్తి జాతీయ శక్తి అని.. జాతీయ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమైందని అన్నారు. సభ అనంతరం గవర్నర్‌కు సమగ్రశిక్షా ఉద్యోగుల సంఘం సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు.
కదిలిన ‘విద్యార్థి’ లోకం
అట్టహాసంగా ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు షురూ..
రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థుల రాక
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
నేడు, రేపు కొనసాగనున్న మహాసభలు
Comments
Please login to add a commentAdd a comment