సమగ్ర శిక్షా ఉద్యోగుల ర్యాలీ
సిద్దిపేటకమాన్: సమస్యలు పరిష్కరించాలంటూ సమగ్ర శిక్షా ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలో గురువారం శాంతియుత ర్యాలీ నిర్వహించి బస్టాండ్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో కరుణాకర్, కరుణ, సుధాకర్, మల్లేశం, సరిత, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment