పకడ్బందీగా రేషన్ కార్డుల సర్వే
కమిషనర్ రమేశ్‌కుమార్
దుబ్బాక: ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీలో రేషన్‌కార్డుల సర్వే పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్ తెలిపారు. గురువారం మున్సిపల్ పరధిలోని దుంపలపల్లిలో రేషన్‌కార్డుల సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులు అందుతాయన్నారు. ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా పారదర్శకంగా సర్వే చేపడుతున్నామన్నారు. ప్రజలు సర్వేకు సహకరించాలన్నారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో సర్వే చేపట్టి కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment