లబ్ధిదారుల ఎంపికపారదర్శకంగా చేపట్టాలి
కలెక్టర్ మనుచౌదరి
తొగుట(దుబ్బాక): లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. మండలంలోని ఘనాపూర్‌లో శనివారం రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, ఏఓ మోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పంచముఖ చౌరస్తాగా నామకరణం
గజ్వేల్: పట్టణంలోని 18వ వార్డులో గల వేంకటేశ్వర ఆలయ పరిసర ప్రాంతాన్ని పంచముఖ చౌరస్తాగా శనివారం నామకరణం చేశారు. ఎమ్మెల్సీ యాదవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై నామకరణం చేసిన బోర్డును ఆవిష్కరించారు. ఇక నుంచి ఆ ప్రాంతాన్ని ఇలాగే పిలవాలని నిర్ణయించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, కమిషనర్ గోల్కొండ నర్సయ్య, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్‌సీ సంతోష్, నాయకులు పాల్గొ న్నారు. వార్డు పరిధిలోని మహిళలకు ఈ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు.
రేషన్ కార్డుల కోసం నిరసన
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని గోనెపల్లిలో అర్హులైన వారందరికీ రేషన్ కా ర్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శనివారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీఓ జనార్దన్‌కు వినతి పత్రం అందజేశారు. మాజీ ఎంపీపీ మాణిక్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పొరపాట్లకు తావివ్వొద్దు
మద్దూరు(హుస్నాబాద్): ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు చేపడుతున్న సర్వేలో ఎలాంటి పొరపాట్ల లేకుండా సర్వే చేయాలని జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం దూల్మిట్ట మండలంలోని గ్రామాల్లో జరగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల సర్వే పారదర్శకంగా చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment