వర్గల్(గజ్వేల్): జవహర్ నవోదయ ఎంట్రెన్స్ పరీక్ష శనివారం నిర్వహించనున్నారు. ఇందుకు అన్ని పరీక్ష కేంద్రాలలో సీటింగ్ ప్రక్రియ, నంబరింగ్ పూర్తయింది. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ అమలులో ఉంటుంది. ఉమ్మడి జిల్లాలోని 30 పరీక్ష కేంద్రాల సెంటర్ లెవెల్ ఆబ్జర్వర్లతో సమీక్షించి ఆయా కేంద్రాల వద్ద సజావుగా సీటింగ్ ఏర్పాట్లు జరిగేలా చర్యలు చేపట్టినట్లు వర్గల్ నవోదయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ పేర్కొన్నారు. పకడ్బందీగా పరీక్ష కొనసాగేలా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. ఇదిలా ఉంటే పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ అనురాధ తెలిపారు. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుని ప్రశాంతంగా పరీక్షలు రాయలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment