గజ్వేల్: ‘తమ భూముల మార్కెట్ విలువకు మూడింతల పరిహారం ఇవ్వాల్సిందే. లేదంటే భూమికి భూమి ఇవ్వాలి. అలా చేయకుండా భూసేకరణ చేపడితే తమకు చావే శరణ్యం ’ అంటూ ట్రిపుల్‌ఆర్ భూ బాధితులు గజ్వేల్‌లో శనివారం ధర్నా చేపట్టారు. నియోజకవర్గంలోని పీర్లపల్లి, నర్సన్నపేట, సామలపల్లి తదితర గ్రామాలకు చెందిన ట్రిపుల్‌ఆర్ భూబాధితులు పట్టణంలోని ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లోని ఆర్‌డీఓ కార్యాలయానికి చర్చల కోసం వచ్చారు. పరిహారం పంపిణీ విషయమై అధికారుల వద్ద నుంచి స్పష్టత రాకపోవడంతో ఆగ్రహానికి గురై...ఐఓసీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ ట్రిపుల్‌ఆర్ అలైన్‌మెంట్ శాసీ్త్రయంగా లేదని, దానిని మారుస్తామని హామీ ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి మాట తప్పారని మండిపడ్డారు. భూమికి భూమి లేదా మార్కెట్ విలువకు మూడింతల పరిహారం చెల్లించి పనులు ప్రారంభించాలని స్పష్టం చేవారు. ఈ సందర్భంగా కొందరు పురుగుమందు డబ్బాలను ప్రదర్శించడం కలకలం రేపింది. పోలీసులు జోక్యం చేసుకొని ధర్నాను విరమింపజేశారు.
లేదంటే భూమికి భూమి ఇవ్వాలి
గజ్వేల్‌లో ట్రిపుల్‌ఆర్ బాధితుల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment