సాక్షి, సిద్దిపేట: నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారు. ఇళ్ల మోడల్ అందరికీ తెలియజేసేలా ప్రతి మండల కేంద్రంలో ఒక ఇల్లును నిర్మించనున్నారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతీ మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇంటిని నిర్మిస్తున్నారు. ఒక్కో ఇంటిని రూ 5లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. తొలుత 23 మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో నిర్మించేందుకు హౌసింగ్ శాఖ కస రత్తు చేపట్టింది. శనివారం పలు మండల కేంద్రాల్లో మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
55వేల మందికి ఇళ్లు లేవు..
జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాయం కోసం 2,30,483 మంది దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించగా 55,025 మందికి ఇంటి స్థలాలు ఉండగా ఇల్లులేదని ప్రాథమికంగా నిర్ధారించారు. 79,526 మందికి ఇంటి స్థలం సైతం లేదని తేలింది. మరోమారు ఉన్నత అధికారులు పరిశీలించి త్వరలో తొలి విడత లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నారు.
హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో..
హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం. ఇంటిని దాదాపు 45 రోజుల్లో పూర్తి చేస్తాం. ప్రతి మండల కేంద్రంలో నిర్మించేందుకు స్థలాలను ఎంపిక చేశాం. మరికొన్ని చోట్ల ఎంపిక చేస్తున్నాం. లబ్ధిదారులు మోడల్ తరహాలోనే నిర్మించుకోవచ్చు.
– శ్యాంప్రసాద్ రెడ్డి, నోడల్ అధికారి, ఇందిరమ్మ ఇళ్లు
23 మండల కేంద్రాల్లో నిర్మాణాల కోసం ఏర్పాట్లు
నేడు పలుచోట్ల శంకుస్థాపన చేయనున్న మంత్రి కొండా సురేఖ
రెండు రకాలుగా..
మోడల్ ఇందిరమ్మ ఇళ్లను రెండు రకాలుగా నిర్మించనున్నారు. స్థలాలకు అనుగుణంగా 20×20, 30×15 ఫీట్లలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నారు. ఇందులో కిచెన్, హాల్, బెడ్ రూం, అటాచ్ బాత్‌రూంలను నిర్మించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment