సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వేలో మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల పరిధిలోని గుర్రాలగోందిలో నిర్వహించిన సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేను ఈ నెల 20 వరకు పూర్తి చేస్తామన్నారు. 21 నుంచి 24 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు. 25వ తేదీ వరకు వివరాలు ఆన్‌లైన్ చేయడం జరుగుతందన్నారు. 26న అందరి సమక్షంలో లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సదానందం, ఎంపిడిఓ శ్రీరాములు, ఎంపీఓ శ్రీనివాస్‌రావు, పంచాయతి సెక్రటరి, ఏఈఓ మౌణిక, ప్రత్యేకాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా చేపట్టాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వ పథకాల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ మను చౌదరి అన్నారు. చిన్నకోడూరు మండలం రామునిపట్లలో శుక్రవారం రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల లబ్ధిదారుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వేను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా రాళ్లు, గుట్టలు ఉన్న భూములను పరిశీలించాలన్నారు. నిర్ణీత సమయంలో సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య, తహసీల్దార్ జయలక్ష్మి, ఎంపీడీఓ జనార్దన్, ఎంపీఓ సోమిరెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి
గుర్రాలగొందిలో సర్వే పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment