రైతులకు సంపూర్ణ ‘సహకారం’
● వ్యవసాయ బావులకు కేరాఫ్ అప్పనపల్లి
● ఇవే ఆ ఊరికి జీవనాధారం
● తరాల నుంచి వీటితోనే పంటల సాగు
● ఎంత కరవొచ్చినా తగ్గని నీళ్లు
● 600 పైగా బావులుంటే..
20 లోపు మాత్రమే బోర్లు
● ఐదు గజాల లోతుల్లోనే నీటి ఊటలు
● ఇది అప్పన్నపల్లి ‘జల’దృశ్యం
ఊరు చుట్టూ ఎత్తయిన గుట్టలు.. పరిచినట్లు కనిపించే బండరాళ్లు. పక్షుల కిలకిలరావాల మధ్య ఎటుచూసినా పచ్చని పంటలతో ప్రకృతి ఒడిలో ఒదిగినట్లు కనిపించే అందమైన పల్లె. సృష్టికి ప్రతిసృష్టి సృష్టిస్తూ ఎన్నో అద్భుతాలు.. ప్రయోగాలతో దూసుకుపోతున్న ఈ హైటెక్ రోజుల్లోనూ దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో వ్యవసాయ బావులపైనే ఆధారపడుతున్నారు. 5 గజాలు తవ్వితే చాలు నీరు ఉబికి వస్తుంది. ఊరు ఊరంతా ఇదే పరిస్థితి. దీంతో గ్రామంలో బోర్లు వేయడం మానేసి.. పాత రోజుల మాదిరిగానే బావులు తవ్వుతున్నారు. పచ్చని పంటలు సాగు చేస్తున్న రైతన్నకు కల్పవల్లి అయిన అప్పనపల్లి గ్రామంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.
చెక్కపల్లి రాజమల్లు, దుబ్బాక రూరల్ / గన్నె తిరుపతిరెడ్డి, దుబ్బాక
కోహెడ(హుస్నాబాద్): రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణ ‘సహకారం’ అందిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా పంటల మార్పిడి చేస్తూ, ఆదాయం ఎక్కవ వచ్చే పంటల సాగు కోసం సహకార సంఘాలు శిక్షణ వేదికలుగా నిలవాలని సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని, లాకర్, గోదాంను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. రూ.కోటి నిధులతో అన్ని హంగులతో కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. రైతు శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అంతకు ముందు శిక్షణ పొందిన 30 మంది మహిళలకు కుట్టు మిషన్, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అంగన్‌వాడి చిన్నారులకు స్కూల్ డ్రెస్‌లు అందజేశారు. ఎన్‌టీఆర్ కాలనీలో ఓపెన్ జిమ్ ప్రారంభించారు.
మంత్రి విస్తృత పర్యటన
కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పొన్నం విస్తృతంగా పర్యటించారు. చెంచల్ చెర్వుపల్లి నుంచి వెంకటేశ్వరపల్లి వరకు రూ.1.20 కోట్లతో బీటీ రోడ్డు ఏర్పాటుకు భూమిపూజ చేశారు. అలాగే మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
సమస్యలు పరిష్కరించండి..
మంత్రికి పూసల కుల సంఘం సభ్యుల వినతి
హుస్నాబాద్: పూసల కుల సంఘం సమస్యలు పరిష్కరించాలని శనివారం హుస్నాబాద్‌లో మంత్రి పొన్నంకు వినతి పత్రం అందజేశారు. పూసల కుల సంఘాన్ని రాష్ట్రంలో ఎంబీసీ జా బితాలో, దేశంలో డీఎన్‌టీ జాబితాలోకి చేర్చే లా కృషి చేయాలని సభ్యులు కోరారు. జిల్లా కేంద్రంలో సంఘ భవనానికి స్థలం కేటాయించాలన్నారు. పూసల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు వెంకట్, జిల్లా అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం, నాయకులు పాల్గొన్నారు.
పర్యాటక కేంద్రంగా మారుస్తాం
హుస్నాబాద్‌రూరల్: ఉమ్మాపూర్‌లోని మహాసముద్రంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం తెలిపారు. శనివారం మంత్రి మహాసముద్రంను పరిశీలించి మాట్లాడారు. హన్మకొండ, సిద్దిపేట జాతీయ రహదారికి కూత వేటు దూరంలో ఉన్న గుట్టల ప్రాంతం పర్యాటకులను ఆకర్షిస్తోందన్నారు. కొండల్లో ట్రెకింగ్, కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
8లో
మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడలో పీఏసీఎస్ కార్యాలయం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment