![మందులు క్రమపద్ధతిలో భద్రపర్చాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/5/04sdp123b-350096_mr-1738718291-0.jpg.webp?itok=yrs7E5BD)
మందులు క్రమపద్ధతిలో భద్రపర్చాలి
సిద్దిపేటకమాన్: డ్రగ్ స్టోర్‌లో మందుల నిల్వలను క్రమపద్ధతిలో భద్రపర్చాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్ తెలిపారు. జిల్లా డ్రగ్ స్టోర్ సెంటర్‌ను డీఎంహెచ్‌ఓ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్‌లోని మందులను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడువుకు దగ్గర ఉన్న మందులపై, వ్యాక్సిన్ నిల్వపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రతి నెలలో ఒకసారి కచ్చితంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులను పంపించాలని సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment