అభ్యంతరాలుంటే తెలపండి
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ఓటర్ జాబితాపై అభ్యంతరాలుంటే తెలపాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం కలెక్టరేట్‌లో పంచాయతీ అధికారితో కలిసి వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా గత ఏడాది సెప్టెంబర్ 28న రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను విడుదల చేసిందన్నారు. జిల్లాలోని 17 పంచాయతీల డ్రాఫ్ట్ ఓటర్ జాబితాను తయారుచేసి ఈనెల 3న గ్రామపంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాలలో ప్రదర్శించినట్లు తెలిపారు. సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని 15 గ్రామ పంచాయతీలు, కొండపాక, అక్కన్నపేట మండలాల్లో ఒక గ్రామ పంచాయతీ చొప్పున పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించి జాబితాను అందిస్తామన్నారు. బుధవారం వరకు అభ్యంతరాలను స్వీకరించి 6న పరిష్కరించి 7న తుది ఓటర్ జాబితాను ప్రచురిస్తామన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
వివిధ రాజకీయ పార్టీ నేతలతో సమావేశం
Comments
Please login to add a commentAdd a comment