దైవ చింతనతోనే ప్రశాంతత
మాధవానంద సరస్వతి స్వామిజీ
దుబ్బాక: నిరంతరం భగవన్నామ స్మరణతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని మాధవానంద సరస్వతి స్వామిజీ అన్నారు. దుబ్బాక పట్టణంలో మహంకాళి ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మాధవానంద సరస్వతి స్వామిజీ ప్రత్యేక పూజలు చేసి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఎన్ని కష్టాలు వచ్చిన ధర్మం తప్పవద్దన్నారు. ఉత్సవాల సందర్భంగా సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్నారు.
ఇదీ షెడ్యూల్
ఈ నెల 3న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల కాగా, అదేరోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించింది. 11న నామినేషన్ పత్రాలు పరిశీలన, 13వ తేదీ వరకు వాటి ఉపసంహరణకు గడువు విధించింది. ఉపసంహరణ అనంతరం పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈనెల 27న ఉదయం 8:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పోలింగ్ నిర్వహించనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment