![గౌరవె](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06hsb78-350023_mr-1738894142-0.jpg.webp?itok=oqF9U34Z)
గౌరవెల్లి ప్రాజెక్టుపై పట్టింపేది?
అక్కన్నపేట(హుస్నాబాద్): గౌరవెల్లి ప్రాజెక్టుపై పర్యవేక్షణ కరువైంది. దీంతో ఆకతాయిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రాజెక్టు కట్టపై సీసీ కెమెరాలు చోరీకి గురయ్యాయి. గతంలో ఈ కట్టపై ఎన్జీటీ చైన్నె బెంచ్ ఆదేశాల మేరకు గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(జీఆర్‌ఎంబీ) అధికారులు సుమారు 8సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అందులో 2 సీసీ కెమెరాలు దొంగలు ఎత్తుకెళ్లడంతో నీటిపారుదల శాఖ అధికారులు రెండ్రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎడమ కాలువ సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను అపహరించారు. ఈ కట్టపై, చుట్టు పక్కలా యువకులు రాత్రి, పగలు తేడా లేకుండా తిరుగుతూ ఫొటోలు దిగుతూ ఆకతాయిలకు పాల్పడుతున్నారని రైతులు అంటున్నారు.
ప్రాజెక్టు పనులు కొనసాగేనా?
మెట్టప్రాంత రైతాంగ చిరకాల గౌరవెల్లి ప్రాజెక్టు కల నెరవేరేదేన్నడో? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏడాదిన్నర దాటుతున్నా ప్రాజెక్టు నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. రైతుల ఆశలు తీరడంలేదు. 1.41టీఎంసీలు తీసుకునేందుకు అనుమతులు ఉండగా దాన్ని 8.23టీఎంసీలకు పెంచారని సవాల్ చేస్తూ పలువురు భూ నిర్వాసితులు ఎన్జీటీలో కేసులు వేశారు. దీంతో ఎన్జీటీ ఆదేశాలతో కట్టపై ఎలాంటి పనులు చేపట్టరాదని సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ పనులు నిలిపివేసి ఏర్పాటు చేసిన క్యాంప్ కార్యాలయం ఖాళీ చేసి వెళ్లిపోయారు.
పరిసరాల్లో ఆకతాయిల ఇష్టారాజ్యం
రాత్రి, పగలు అనే తేడా లేకుండా తిరుగుతున్న యువకులు కట్టపై సీసీ కెమెరాలు మాయం
పోలీసులకు ఫిర్యాదు చేసిననీటిపారుదల అధికారులు
![గౌరవెల్లి ప్రాజెక్టుపై పట్టింపేది? 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06hsb78a-350023_mr-1738894142-1.jpg)
గౌరవెల్లి ప్రాజెక్టుపై పట్టింపేది?
Comments
Please login to add a commentAdd a comment