![మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే డిబారే..](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06sdp31-350004_mr-1738894144-0.jpg.webp?itok=aqss69x1)
మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే డిబారే..
● డీఐఈఓ రవీందర్‌రెడ్డి ● కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్
సిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడకుండా పరీక్షలను ప్రశాంతంగా రాయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ), పరీక్షల కమిటీ జిల్లా కన్వీనర్ రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షల్లో భాగంగా గురువారం పట్టణంలోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మాస్‌కాపీయింగ్ పాల్పడితే డిబార్ చేస్తామన్నారు. ఇంటర్ బోర్డు అధికారులు ప్రైవేట్ కళాశాలల పరీక్షా కేంద్రాల్లో సైతం సీసీ కెమరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీసీ కెమరాల ఏర్పాటుతో కమాండ్ కంట్రోల్ రూంనుంచి పరీక్షలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. డీఐఈఓ కార్యాలయంలో జిల్లా కంట్రోల్‌రూంను ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూం ఇంచార్జ్‌గా చక్రవర్తి ఉంటారని ఏవైనా సమస్యలు ఉంటే 9949330191 నంబర్‌లో సంప్రదించాలన్నారు. జిల్లాలోని గజ్వేల్, చేర్యాల, మద్దూరు, తొగుట, సిద్దిపేట పట్టణాల్లోని పరీక్షా కేంద్రాలను హెచ్‌పీసీ సభ్యులు, స్క్వాడ్ సభ్యులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment