![ములుగు యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06gjw61-350083_mr-1738894143-0.jpg.webp?itok=qGOpwDCe)
ములుగు యూనివర్సిటీ లోగో ఆవిష్కరణ
ములుగు(గజ్వేల్): ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయం లోగో, క్యాలెండర్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆవిష్కరించారు. కార్యక్రమం గురువారం నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వైస్ ఛాన్స్‌లర్ రాజిరెడ్డి మంత్రిని సన్మానించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ భగవాన్, వర్సిటీ అధికారులు పాల్గొన్నారు.
అమెరికన్ అధికారుల బృందం సందర్శన
ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని అమెరికాలోని ఆబర్న్ విశ్వవిద్యాలయం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సందర్శించింది. అకాడమిక్ ఎక్సలెన్స్, పరిశోధన అవకాశాలను పెంపొందించడం లక్ష్యంగా ఈ బృందంతో వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ దండ రాజిరెడ్డితో చర్చలు జరిపింది. విద్యా కార్యక్రమాల బలోపేతం, ఆన్ లైన్, సర్టిఫికెట్ కోర్సులు తదితర అంశాలపై చర్చించారు. అమెరికా బృందంలో డాక్టర్. జానకీ, గోవింద్‌కన్నన్, షీనా, స్టీవర్ట్, డాక్టర్. వృషాంక్‌రాఘవ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment