![ఉత్తమ ఫలితాలే లక్ష్యం కావాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06gjw51d-350020_mr-1738894144-0.jpg.webp?itok=aJ7Yj2uX)
ఉత్తమ ఫలితాలే లక్ష్యం కావాలి
● విద్యార్థులకు స్లిప్ టెస్టులు చేపట్టండి ● ఉపాధ్యాయులతో కలెక్టర్ మనుచౌదరి
కొండపాక(గజ్వేల్): ఉత్తమ ఫలితాల కోసం టెన్త్, ఇంటర్ విద్యార్థులకు స్లిప్ టెస్టులు ఎక్కువగా నిర్వహించాలని కలెక్టర్ ఎం. మనుచౌదరి సూచించారు. మండలంలోని దుద్దెడలోగల సోషల్ వెల్ఫేర్ బాలుర రెసిడిన్షియల్ స్కూల్, కొండపాకలోని జూనియర్ కళాశాల, సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్, బాలికల హాస్టల్‌ను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. అలాగే వంట గదులను, సరుకులను పరీశీలించారు. ఈ సందర్భంగా టెన్త్ విద్యార్థులతో మాట్లాడుతూ పలు సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగారు. అలాగే పాఠ్యాంశాలను బోధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో 10/10 జీపీఏ సాధించేలా విద్యార్థులు చదవాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అన్ని సబ్జెక్టులను రివిజన్ చేయాలన్నారు. మధ్యాహ్న భోజనంలో కాలం చెల్లిన సరుకులను వాడినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దిలీప్ నాయక్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment