రసవత్తరంగా గౌడ సంఘం ఎన్నికలు
సిద్దిపేటజోన్: పట్టణ గీత పారిశ్రామిక సంఘం ఎన్నికలు గురువారం రసవత్తరంగా సాగాయి. మున్సిపల్ ఎన్నికలను తలపించేలా కొన్ని రోజులుగా అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. మొత్తం తొమ్మిది స్థానాలకు గాను 24మంది పోటీ చేశారు. స్థానిక డిపోలో పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల అధికారిగా రఘోత్తమ్ రెడ్డి వ్యవహరించారు. మొత్తంగా 321 ఓట్లకు గాను 318 ఓట్లు పోల్ అయ్యాయి. రాత్రి సమయంలో ఫలితాలు విడుదల చేశారు. పోటీచేసిన పల్లె బాలకిషన్ గౌడ్, గాదగోని కిష్టయ్య, గాదగోని ప్రకాష్ గౌడ్, గాదగోని సత్యం గౌడ్, పల్లె సునీల్, పల్లె లాల్‌బహుదూర్, మార్క శ్రీనివాస్ గౌడ్, పల్లె జ్యోతి, బాలగొని బుచ్చవ్వలు ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నిక శుక్రవారం జరగనుంది. వీరిలో ఒక్కరినీ సొసైటీ చైర్మన్‌గా గెలిచిన సభ్యులు ఎన్నుకుంటారు. వీరి పదవీ కాలం ఐదేళ్లు. ఫలితాలు వెలువడిన వెంటనే విజయం సాధించిన వారి అనుచరులతో డిపో ప్రాంతం సందడిగా మారింది.
తొమ్మిది మంది అభ్యర్థులు విజయం
Comments
Please login to add a commentAdd a comment