న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతూ విరాట్ కోహ్లి తీసుకున్న సంచలన నిర్ణయంపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) స్పందించింది. కోహ్లి నిర్ణయాన్ని స్వాగతించిన బీసీసీఐ.. అతనికి అభినందనలు తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా.. కోహ్లి నిర్ణయం తర్వాత స్పందించారు.
‘టీమిండియా కెప్టెన్‌గా జట్టును ఉన్నతస్థాయికి తీసుకెళ్లావు. స్వదేశంలోనూ , విదేశాల్లోనూ నీ కెప్టెన్సీలో భారత జట్టు బలమైన శక్తిగా ఎదిగింది. ఇందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో నీ సారథ్యంలో సాధించిన విజయాలు ప్రత్యేకం. ఎప్పటికీ మరువలేనివి’ అని జై షా పేర్కొన్నారు.
మరొకవైపు కోహ్లి ఆకస్మిక నిర్ణయంపై బీసీసీఐ తన ట్వీటర్ అకౌంట్‌లో స్పందించింది. కోహ్లి కెప్టెన్సీలో భారత జట్టు ఎన్నో మైలురాళ్లను అధిగమించడమే కాకుండా, అత్యున్నత స్థాయికి వెళ్లిందని పేర్కొంది. టెస్టుల్లో భారత్ తరఫున 68 మ్యాచ్‌లకు కోహ్లి నేతృత్వం వహించగా 40 విజయాలను సాధించిన విషయాన్ని బీసీసీఐ గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది.
చదవండి: విరాట్ కోహ్లి సంచలన ప్రకటన.. టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై
BCCI congratulates #TeamIndia captain @imVkohli for his admirable leadership qualities that took the Test team to unprecedented heights. He led India in 68 matches and has been the most successful captain with 40 wins. https://t.co/oRV3sgPQ2G— BCCI (@BCCI) January 15, 2022
Comments
Please login to add a commentAdd a comment