Ind Vs SL: Team India Off To Srilanka Tour Under Coach Rahul Dravid - Sakshi
Sakshi News home page

India Tour Of Sri Lanka: శ్రీలంకకు బయల్దేరిన భారత జట్టు ఇదే!

Published Mon, Jun 28 2021 2:35 PM | Last Updated on Mon, Jun 28 2021 7:02 PM

Ind Vs SL: Shikhar Dhawan Led Team India Left For Sri Lanka 3 Odi 3 T20 Matches - Sakshi

బీసీసీఐ షేర్‌ చేసిన టీమిండియా ఫొటో(కర్టెసీ: బీసీసీఐ)

న్యూఢిల్లీ: వన్డే, టీ20 సిరీస్‌ నిమిత్తం శిఖర్‌ ధావన్‌ సారథ్యంలోని టీమిండియా సోమవారం శ్రీలంక పర్యటనకు బయల్దేరింది. మొత్తం 20 మంది సభ్యులు, ఐదుగురు నెట్‌ బౌలర్లతో కూడిన జట్టు విమానంలో పర్యాటక దేశానికి పయనమైంది. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా వెల్లడించిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) టీమిండియా ఫొటోను షేర్‌ చేసింది. కాగా జూలై 1 వరకు కొలంబోలో క్వారంటైన్‌లో ఉండనున్న భారత జట్టు, జూలై 13 నుంచి 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌కై సన్నద్ధం కానుంది. ఇక యువజట్టు కెప్టెన్‌గా ధావన్‌ వ్యవహరించనుండగా, రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా మార్గనిర్దేశనం చేయనున్న సంగతి తెలిసిందే.

శ్రీలంక టూర్‌కు వెళ్లిన భారత జట్టు: శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, దేవదత్‌ పడిక్కల్‌, రుత్‌రాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్యా, నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌(వికెట్‌ కీపర్‌), యజువేంద్ర చాహల్‌, రాహుల్‌ చహర్‌, కే గౌతం, కృనాల్‌ పాండ్యా, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, భువనేశ్వర్‌ కుమార్‌(వైస్‌ కెప్టెన్‌), దీపక్‌ చహర్‌, నవదీప్‌ సైనీ, చేతన్‌ సకారియా.

నెట్‌ బౌలర్స్‌: ఇషాన్‌ పోరేల్‌, సందీప్‌ వారియర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, సాయి కిషోర్‌, సిమర్‌జీత్‌ సింగ్‌.

షెడ్యూల్‌: మ్యాచ్‌లన్నీ కొలంబోలోని ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో జరుగనున్నాయి.
వన్డేలు: 3
►జూలై 13, 16, 18 తేదీల్లో 3 వన్డేలు
టీ20 మ్యాచ్‌లు:
►జూలై 21, 23,25 మూడు టీ20 మ్యాచ్‌లలో ఇరు జట్లు తలపడనున్నాయి.

చదవండి: సొంత జట్టుకు వ్యతిరేకంగా లంక అభిమానుల ప్రచారం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement