Breadcrumb
PBKS Vs RR Updates: పంజాబ్ వర్సెస్ రాజస్తాన్.. అప్డేట్స్
Published Sat, May 7 2022 2:58 PM | Last Updated on Sat, May 7 2022 7:30 PM
Live Updates
IPL 2022: పంజాబ్ వర్సెస్ రాజస్తాన్.. అప్డేట్స్
పంజాబ్‌పై రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం
ఐపీఎల్-2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఈ సీజన్లో ఏడో విజయాన్ని నమోదు చేసి 14 పాయింట్లు సాధించింది.
కాగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో జానీ బెయిర్‌స్టో(56) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌కు ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(68), జోస్ బట్లర్(30) శుభారంభం అందించారు. సంజూ శాంసన్(23), దేవ్‌దత్ పడిక్కల్(31) రాణించగా.. ఆఖర్లో 16 బంతుల్లో 31 పరుగులతో అజేయంగా నిలిచి హెట్మెయిర్ జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఐపీఎల్ మ్యాచ్: 52- పంజాబ్ వర్సెస్ రాజస్తాన్ మ్యాచ్ స్కోర్లు:
పంజాబ్-189/5 (20)
రాజస్తాన్-190/4 (19.4)
That's that from Match 52 as @rajasthanroyals win by 6 wickets.#TATAIPL #PBKSvRR pic.twitter.com/RloiU9m1LJ
— IndianPremierLeague (@IPL) May 7, 2022
తీవ్ర ఉత్కంఠ
పంజాబ్- రాజస్తాన్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. పందొమ్మిదో ఓవర్ ఐదో బంతికి అర్ష్‌దీప్ సింగ్ రాజస్తాన్ బ్యాటర్ పడిక్కల్‌ను అవుట్ చేశాడు. దీంతో 18.5 ఓవర్ల వద్ద రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. రాజస్తాన్ గెలవాలంటే 6 బంతుల్లో 8 పరుగులు చేయాలి.
హెట్మెయిర్ మెరుపులు.. ఒత్తిడిలో పంజాబ్
రాజస్తాన్ హిట్టర్ హెట్మెయిర్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరిగెత్తిస్తున్నాడు. దేవ్‌దత్ పడిక్కల్‌కు సహకారం అందిస్తూ మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొడుతున్నాడు. 10 బంతుల్లో మూడు పక్షర్లు, ఒక సిక్సర్ సాయంతో అతడు 23 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
దీంతో 18 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 3 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. విజయానికి 12 బంతుల్లో 11 పరుగులు తీయాల్సిన స్థితిలో నిలిచింది. దీంతో పంజాబ్ బౌలర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.
మూడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్
68 పరుగులతో జోష్ మీదున్న యశస్వి జైస్వాల్‌కు పంజాబ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ షాకిచ్చాడు. అతడి బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి యశస్వి పెవిలియన్ చేరాడు.
తద్వారా కీలక సమయంలో బిగ్ వికెట్ తీసి అర్ష్‌దీప్ పంజాబ్‌కు బ్రేక్ ఇచ్చాడు. 15 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ స్కోరు 143-3. పడిక్కల్, హెట్మెయిర్ క్రీజులో ఉన్నారు. రాజస్తాన్ గెలవాలంటే 29 బంతుల్లో 46 పరుగులు చేయాలి.
యశస్వి జైశ్వాల్ హాఫ్ సెంచరీ
పంజాబ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ అర్ధ శతకంతో మెరిశాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 50 పరుగులు సాధించాడు.
ధావన్ బౌలింగ్.. ధావన్ క్యాచ్
సంజూ శాంసన్ రూపంలో రాజస్తాన్ మరో వికెట్ కోల్పోయింది. రిషి ధావన్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ వెనుదిరిగాడు. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. 8.1 ఓవర్లలో రాజస్తాన్ స్కోరు: 85/2. దేవ్‌దత్ పడిక్కల్, యశస్వి జైశ్వాల్ క్రీజులో ఉన్నారు.
యశస్వి, సంజూ ఆచితూచి ఆడుతూనే.
రాజస్తాన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్(23), కెప్టెన్ సంజూ(21) శాంసన్ ఆచితూచి ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నారు. వీరిద్దరి నిలకడైన ఇన్నింగ్స్‌తో ఏడు ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ ఒక వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది.
దంచి కొట్టిన బట్లర్.. కానీ అంతలోనే
నాలుగో ఓవర్లో రబడ బౌలింగ్‌లో బట్లర్ చితక్కొట్టాడు. సిక్సర్‌తో మొదలెట్టి వరుసగా 4,4,2,4 పరుగులు సాధించాడు. ముఖ్యంగా ఓవర్ ఐదో బంతికి రబడ సంధించిన యార్కర్‌ను అద్భుతంగా ఎదుర్కొని బౌండరీ బాదిన విధానం ఆకట్టుకుంది.
ఇదే జోరులో ఆఖరి బంతిని గాల్లోకి లేపిన బట్లర్ రాజపక్సకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్‌లో బట్లర్ స్కోరు: 16 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 30 పరుగులు.
యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ క్రీజులో ఉన్నారు. ఐదు ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ స్కోరు: 56/1 (5)
యశస్వి జైశ్వాల్ వచ్చీరాగానే
కరుణ్ నాయర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రాజస్తాన్ యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ మొదటి ఓవర్లో పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు చుక్కలు చూపించాడు. ఫోర్, సిక్స్, ఫోర్ సాయంతో 14 పరుగులు పిండుకున్నాడు.
ఇక జోస్ బట్లర్ రబడ బౌలింగ్‌లో ఫోర్‌తో ఖాతా తెరవడంతో రెండు ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ స్కోరు: 20-0.
రాజస్తాన్‌తో మ్యాచ్.. పంజాబ్ స్కోరు ఎంతంటే
ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు సాధించింది.
ఓపెనర్ జానీ బెయిర్ స్టో అర్ధ శతకం(40 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్- 56 పరుగులు)తో ఆకట్టుకున్నాడు. ఇక శిఖర్ ధావన్ 12, భనుక రాజపక్స 27, మయాంక్ అగర్వాల్ 15 పరుగులు చేశారు. ఇక ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన జితేశ్ శర్మ 18 బంతుల్లోనే 38 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.
లివింగ్‌స్టోన్(14 బంతుల్లో 22 రన్స్) చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్తాన్ బౌలర్లలో యజువేంద్ర చహల్‌కు మూడు, అశ్విన్‌కు ఒకటి, ప్రసిద్ కృష్ణకు ఒక వికెట్ దక్కాయి.
ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్
సిక్స్, ఫోర్ బాది జోరు మీదున్న లివింగ్‌స్టోన్‌ను ప్రసిద్ కృష్ణ పెవిలియన్‌కు పంపాడు. అద్భుత యార్కర్‌తో అతడిని బౌల్డ్ చేశాడు. దీంతో 22 పరుగుల వద్ద లివింగ్‌స్టోన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 19 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 173/5
నిలకడగా ఆడుతూ..
జితేశ్ శర్మ(23 పరుగులు), లియామ్ లివింగ్‌స్టోన్(22 పరుగులు) నిలకడగా ఆడుతూ పంజాబ్ స్కోరును ముందుకు నడిపిస్తున్నారు. లివింగ్ స్టోన్ వీలు చిక్కినప్పుడల్లా సిక్సర్లు బాదుతూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు.
దెబ్బ కొట్టిన చహల్
చహల్ దెబ్బకు ఒకే ఓవర్లో పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది. 15వ ఓవర్ రెండో బంతికి మయాంక్‌ను, నాలుగో బంతికి బెయిర్ స్టోను అతడు పెవిలియన్‌కు పంపాడు. 15 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు 122-4. జితేశ్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్ క్రీజులో ఉన్నారు.
బెయిర్ స్టో ఇన్నింగ్స్‌కు తెర
అద్భుత హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్న పంజాబ్ ఓపెనర్ జానీ బెయిన్ స్టో ఇన్నింగ్స్‌కు తెరపడింది. చహల్ బౌలింగ్‌లో అతడు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 56 పరుగుల వ్యక్తిగత స్కోరు(8 ఫోర్లు, ఒక సిక్సర్) వద్ద నిష్క్రమించాడు. దీంతో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది.
అంతకుముందు మయాంక్ అవుట్ కావడంతో ఒకే ఓవర్లో పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయింది.
మయాంక్ అవుట్
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పెవిలియన్ చేరాడు. కాగా మయాంక్ ఈ మ్యాచ్‌లో 13 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 15 పరుగులు చేశాడు. జితేశ్ శర్మ క్రీజులోకి వచ్చాడు.
బెయిర్ స్టో అర్ధ శతకం
అదిరిపోయే ఇన్నింగ్స్‌తో పంజాబ్‌కు శుభారంభం అందించిన ఓపెనర్ జానీ బెయిర్ స్టో హాఫ్ సెంచరీ సాధించాడు. 34 బంతులల్లో 50 పరుగులు(7 ఫోర్లు, ఒక సిక్స్) పూర్తి చేసుకున్నాడు. 13 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు:109/2
రెండో వికెట్ డౌన్.. రాజపక్స బౌల్డ్
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. యజువేంద్ర చహల్ బౌలింగ్‌లో భనుక రాజపక్స బౌల్డ్ అయ్యాడు. ఇక మొత్తంగా 18 బంతులు ఎదుర్కొన్న ఈ వన్‌డౌన్ బ్యాటర్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 27 పరుగులు చేశాడు.
కెప్టెన్ మయాంక్ అగర్వాల్ క్రీజులోకి వచ్చాడు. పదకొండు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 93-2
ఫామ్‌లోకి వచ్చిన బెయిర్ స్టో
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పటి వరకు 23 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 38 పరుగులు చేశాడు.
ఇక మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 12 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ క్రమంలో ఎనిమిది ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ ఒక వికెట్ కోల్పోయి 64 పరుగులు చేసింది.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
శిఖర్ ధావన్ రూపంలో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి గబ్బర్ పెవిలియన్ చేరాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు(16 బంతుల్లో 2 ఫోర్లు) వద్ద నిష్క్రమించాడు. భనుక రాజపక్స క్రీజులోకి వచ్చాడు.
మూడో ఓవర్లో సున్నా!
మొదటి ఓవర్లో పది పరుగులు సమర్పించుకున్న రాజస్తాన్ బౌలర్ బౌల్ట్ మూడో ఓవర్లో మాత్రం ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మెయిడిన్ ఓవర్ అయ్యింది. మూడో ఓవర్ ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 17-0.
ఫోర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన పంజాబ్
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో పంజాబ్ ఫోర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో బెయిర్ స్టో బౌండరీ బాదాడు. మొదటి ఓవర్లో మొత్తంగా పది పరుగులు(4 0 0 4 2 0) రాబట్టాడు.
పంజాబ్ వర్సెస్ రాజస్తాన్ తుది జట్లు ఇవే!
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు:
జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, దేవ్‌దత్ పడిక్కల్, రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్మెయిర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ కృష్ణ, యజువేంద్ర చహల్, కుల్దీప్ సేన్.
పంజాబ్ కింగ్స్
జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, భనుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ.
టాస్ గెలిచిన పంజాబ్
ఐపీఎల్-2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా అనిపిస్తోంది గనుక తాము తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటున్నట్లు పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తెలిపాడు.
🚨 Toss Update 🚨@PunjabKingsIPL have elected to bat against @rajasthanroyals.
— IndianPremierLeague (@IPL) May 7, 2022
Follow the match ▶️ https://t.co/Oj5tAfX0LP #TATAIPL | #PBKSvRR pic.twitter.com/7aagJzGe5A
Related News By Category
Related News By Tags
-
కీలక సమయంలో స్వదేశానికి రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు?
రాజస్తాన్ రాయల్స్ స్టార్ ఆటగాడు షిమ్రోన్ హెట్‌మైర్ జట్టను వీడాడు. వ్యక్తిగత కారణాల రిత్యా హెట్‌మైర్ స్వదేశానికి వెళ్లాడని.. వచ్చే వారం జట్టుతో కలుస్తాడని ఆదివారం రాజస్తాన్ రాయల్స్ జట్టు మేనేజ్...
-
ఆడడం లేదని పక్కనబెట్టారు.. తన విలువేంటో చూపించాడు
ఐపీఎల్-2022 లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైశ్వాల్(41 బంతుల్లో 68, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తన విలువేంటో చూపించాడు. ఈ సీజన్లో సరైన ప్రదర్శన ఇవ్వని కారణంగా ఏడు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న జైశ్...
-
IPL 2022: రాయల్స్‌కు ‘జై’
ముంబై: సీజన్ ఆరంభానికి ముందు రాజస్తాన్ రాయల్స్ జట్టు యశస్వి జైస్వాల్‌ను రూ. 4 కోట్లకు రిటెయిన్ చేసుకుంది. ఆడిన 3 మ్యాచ్‌లలో వరుసగా 20, 1, 4 పరుగులే చేయడంతో అతడిని తుది జట్టు నుంచి తప్పించింది. ఇప్...
-
IPL 2022: వారెవ్వా చహల్.. మూడు వికెట్లు.. అద్భుత రికార్డు!
IPL 2022 PBKS Vs RR- Yuzvendra Chahal Record: ఐపీఎల్ మెగా వేలం-2022కు ముందు క్లిష్ట పరిస్థితి ఎదుర్కొన్నాడు టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్. రిటెన్షన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతడిన...
-
IPL 2022: కరుణ్ అవుట్.. యశస్వి ఇన్: సంజూ శాంసన్
IPL 2022 PBKS Vs RR: ఐపీఎల్- 2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. కరుణ్ నాయర్ స్థానంలో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి వచ్చాడు. ఇ...
Comments
Please login to add a commentAdd a comment