బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన అప్‌కమింగ్ మూవీ 'కిసీ కా భాయ్, కిసీ కి జాన్' సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన ఫేవరెట్ క్రికెటర్ పేరును రివీల్ చేశాడు. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో ప్రసారమయ్యే 'క్రికెట్ లైవ్' షోలో సల్మాన్ తాను అభిమానించే క్రికెటర్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అని బహిర్గతం చేశాడు.
Can't keep our calm as we will be joined by @BeingSalmanKhan at the #StarSportsHQ!😍😍
— Star Sports (@StarSportsIndia) April 13, 2023
Tune-in, this weekend, 2:30PM onwards, on Star Sports Network.
Ab hoga #DhaiSeBhai along with #IPLonStar #KisiKaBhaiKisiKiJaan pic.twitter.com/NdduTK7RsS
సరదాగా సాగే ఈ ప్రోగ్రాంలో సల్లూ భాయ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన స్పూర్తిదాయకమైన కథలను పిల్లలకు నేర్పించనున్నాడు. అలాగే తన తదుపరి సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకోనున్నాడు. ఈ షో ఈ వారాంతం మధ్యాహ్నం 2:30 గంటలకు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుంది.
ఈ షోలో సల్మాన్, ధోనితో పాటు విరాట్ కోహ్లి, హార్ధిక్ పాండ్యా, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ గురించి ప్రస్తావించాడు. కోహ్లి నుంచి కృషి, పట్టుదల.. హార్ధిక్ నుంచి కలలను సాకారం చేసుకోవడం.. సీఎస్‌కే ఫ్యాన్స్ నుంచి ప్రేమను పంచుకోవడం లాంటి లక్షణాలను అలవర్చుకోవాలని పిల్లలను బోధిస్తాడు. పై పేర్కొన్న విషయాలన్నీ తన తదుపరి సినిమాలో ప్రతిబింబిస్తాయని సల్లూ బాబా పిల్లలకు వివరిస్తాడు.
నార్త్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిని (ధోని) చెన్నై అభిమానులు ఏరకంగా ఆధరిస్తున్నారో అన్న విషయాన్ని హైలైట్ చేశాడు. ఈ ప్రోమోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సల్మాన్ సౌత్‌లో తన చిత్ర ప్రమోషన్‌పై ఎక్కువగా దృష్టి సారించాడని, అందులో భాగంగానే ధోనిని, చెన్నై అభిమానులను హైలైట్ చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. కొందరేమో సల్మాన్‌కు ధోనిపై నిజంగా ఉందేమోనని అంటున్నారు. మొత్తానికి బాలీవుడ్ క్రేజీ హీరో, వరల్డ్స్ మోస్ట్ లవబుల్ క్రికెటర్ పేరు జపించడాన్ని క్రికెట్ అభిమానులు ఆస్వాధిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రెండు వరుస విజయాలు సాధించి జోష్ మీదుండిన సీఎస్‌కే నిన్న (ఏప్రిల్ 12) రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలై హ్యాట్రిక్ విక్టరీలు సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో ధోని, జడేజా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చినప్పటికీ సీఎస్‌కేను గెలిపించలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment