వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య | Three Suicides due to different reasons | Sakshi
Sakshi News home page

వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య

Published Thu, Apr 20 2023 12:24 AM | Last Updated on Thu, Apr 20 2023 6:00 AM

ఆదిలక్ష్మి మృతదేహం  - Sakshi

ఆదిలక్ష్మి మృతదేహం

ఉరేసుకుని వివాహిత..

వెంకటాచలం : ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని కనుపూరులో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. కనుపూరు పంచాయతీ జ్యోతినగర్‌కు చెందిన ఇనగలూరు నరేష్‌, ఆదిలక్ష్మి(32) దంపతులు. వారికి ఇద్దరు సంతానం. కాగా ఆదిలక్ష్మి మంగళవారం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. కుటుంబసభ్యులు కొద్దిసేపటి తరువాత ఇంట్లోకి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతుండటంతో పెద్దగా కేకలు వేశారు. చుట్టుపక్కల వారి సాయంతో ఆదిలక్ష్మిని కిందకు దింపారు. కాగా అప్పటికే ఆమె మృతి చెందింది. అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడిందా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా తెలియరాలేదు. ఆదిలక్ష్మి తల్లి పెంచలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోలీసులు బుధవారం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పురుగు మందు తాగి..

పొదలకూరు : మండలంలోని నల్లపాళెం గ్రామానికి చెందిన మెట్టుకూరు ప్రతాప్‌రెడ్డి(29) అనే యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కరిముల్లా బుధవారం కేసు నమోదు చేసి వివరాలు వెల్లడించారు. ఏడేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో ప్రతాప్‌రెడ్డి నడుముకు గాయమై నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈ క్రమంలో అతను మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంట్లోని పురుగు మందును తాగాడు. చికిత్స నిమిత్తం పొదలకూరు సీహెచ్‌సీకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం నెల్లూరు రామచంద్రారెడ్డి ఆస్పత్రికి తరలించినా లాభం లేక మృతి చెందాడు.

గడ్డిమందు తాగి..

మనుబోలు : మండలంలోని పిడూరుపాళెం గ్రామంలో గడ్డిమందు తాగి బుధవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వలమేటి వెంకటరమణయ్య(37) మద్యానికి బానిసయ్యాడు. మద్యం తాగవద్దని భార్య ఎంత చెప్పినా వినకుండా తాగుతుండడంతో కుటుంబ సభ్యులు నిలదీశారు. దీంతో మంగళవారం ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement