![ట్రోఫీ అందజేస్తున్న ఎస్‌ఈ - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/12/11vgr41-410005_21_10_mr_0.jpg.webp?itok=F-BWTU1R)
ట్రోఫీ అందజేస్తున్న ఎస్‌ఈ
● రూ.6.50 లక్షల సొత్తు రికవరీ
నెల్లూరు రూరల్: తాళం వేసిన ఇళ్లు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.6.50 లక్షల విలువైన 25 సవర్ల బంగారం, మోటార్‌బైక్ ఒకటి, రూ.10 వేలు రికవరీ చేసినట్లు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి తెలిపారు. నెల్లూరులోని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పడారుపల్లికి చెందిన షేక్ గౌస్‌బాషా, నెల్లూరు రూరల్ మండలంలోని నారాయణరెడ్డిపేటకు చెందిన లింగుబేరి రాంబాబు, కావలికి చెందిన నడింపల్లి గోపీ జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నారు. వారిపై వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులున్నాయి. రూరల్ మండలం ధనలక్ష్మీపురం సమీపంలోని సామంతులవారితోట ప్రాంతంలో ఉంటున్న బుండి శ్రీహరి కుటుంబం గత నెల 27వ తేదీన నెల్లూరుకు వెళ్లి వచ్చేలోపు నిందితులు 12 సవర్ల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఆదేశాలతో రూరల్ డీఎస్పీ పర్యవేక్షణలో రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసును ఛేదించిన రూరల్ సీఐ పి.సుబ్బారావు, ఎస్సై స్వప్న, ఐడీ పార్టీ ఏఎస్సై గిరిధర్‌రావు, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్, సిబ్బంది సతీష్, ప్రసాద్, ఆదినారాయణ, అల్లాభక్షు, మునికృష్ణ, శ్రీనివాసులును ఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు.
ముగిసిన విద్యుత్
ఉద్యోగుల క్రికెట్ పోటీలు
వెంకటగిరిరూరల్: పట్టణంలోని తారకరామా క్రీడా ప్రాంగణంలో విద్యుత్ ఉద్యోగుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం హోరాహోరీగా సాగింది. ఇందులో ఏపీ ఈపీడీసీఎల్ రాజమండ్రి జట్టు విజయం సాధించింది. రెండో స్థానంలో ఎన్‌టీటీపీఎస్ విజయవాడ జట్టు నిలిచింది. వారికి ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ శేషారెడ్డి బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనరల్ స్పోర్ట్స్ కౌన్సిలర్ సెక్రటరీ బలరామమూర్తి, బి.సురేష్, కె.రామాంజనేయులు, డీఈఈ ముని రవిచంద్ర, సతీష్‌కుమార్ పాల్గొన్నారు.
![మాట్లాడుతున్న రూరల్ డీఎస్పీ
వీరాంజనేయరెడ్డి 1](https://www.sakshi.com/gallery_images/2024/02/12/11nlr131-240032_mr.jpg)
మాట్లాడుతున్న రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment