![ఉత్తమ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11nlr117a-240028_mr-1739301598-0.jpg.webp?itok=LWdEn51q)
ఉత్తమ పర్సంటైల్ సాధన
● జేఈఈ మెయిన్స్ ఫలితాలు వెల్లడి
నెల్లూరు (టౌన్): ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 7వేల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. కె.పూర్వజ్ 99.98, కె.మధుకిరణ్‌రెడ్డి 99.93, బి.భానురిషిక్ 99.92, ఎం.అఖిలేష్ 99.91 పర్సంటైల్‌ను సాధించారు.
సాఫ్ట్‌వేర్‌గా పనిచేయాలని ఉంది
కె.పూర్వజ్‌ది నెల్లూరులోని బ్రహ్మదేవం స్వస్థలం. తండ్రి కె.రమేష్ ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. తల్లి శ్రీవల్లి గృహిణి. అడ్వాన్స్‌డ్ పరీక్షలో కూడా ఉత్తమ ఫలితాలు సాధించి బాంబే ఐఐటీలో సీటు సాధించి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేయాలన్నదే లక్ష్యం. – కె.పూర్వజ్
ఉత్తమ ఐఐటీలో చేరడమే లక్ష్యం
నెల్లూరు నగరంలోని జేమ్స్ గార్డెన్ భాను
రిషిక్ స్వస్థలం. తండ్రి బొమ్మన రమణయ్య, తల్లి ఉమామహేశ్వరి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉత్తమ కళాశాలలో ఐఐటీ చదవడమే లక్ష్యంగా చెబుతున్నారు.
– భానురిషిక్
●
బాంబే ఐఐటీలో చేరాలన్నదే లక్ష్యం
ఎం.అఖిలేష్‌ది తమిళనాడులోని నామకల్ స్వస్థలం. తండ్రి మాదీశ్వరన్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తల్లి శశికళ గృహిణి. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో కూడా ఉత్తమ ర్యాంకు సాధించి బాంబే ఐఐటీలో చదవాలన్నదే లక్ష్యంగా చెబుతున్నారు. – ఎం.అఖిలేష్
![ఉత్తమ పర్సంటైల్ సాధన1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11nlr117-240028_mr-1739301598-1.jpg)
ఉత్తమ పర్సంటైల్ సాధన
![ఉత్తమ పర్సంటైల్ సాధన2](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11nlr117b-240028_mr-1739301598-2.jpg)
ఉత్తమ పర్సంటైల్ సాధన
Comments
Please login to add a commentAdd a comment