పాఠశాల విలీనాన్ని ఒప్పుకోం
● బోడిపాడు స్కూల్ ఎదుట
తల్లిదండ్రుల నిరసన
చేజర్ల: ఇటీవల పలు ప్రభుత్వ పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేస్తుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చేజర్ల మండలంలోని బోడిపాడు గ్రామ ప్రాథమిక పాఠశాలలోని 3, 4, 5 తరగతులను చేజర్ల మెయిన్ పాఠశాలలో విలీనం చేయనున్నారని తెలియడంతో మంగళవారం పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన ప్రదర్శన చేశారు. తమ గ్రామంలోని పాఠశాల తరగతులను చేజర్ల పాఠశాలలో విలీనం చేస్తే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment