![తల్లి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11atk123-240078_mr-1739301598-0.jpg.webp?itok=79xNLVfq)
తల్లిని కాపాడేందుకు...
సోమశిల: పేద కుటుంబంలో సంతోష ఘడియలు వస్తున్న సమయంలో అనుకోని విషాదం చోటుచేసుకుంది. అనంతసాగరం మండలంలోని శంకరనగరం గ్రామానికి చెందిన చెందిన ఉప్పలపాటి కొండయ్య, శోభ దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. మంగళవారం పశువుల మేత కోసం శోభ, ఆమె కుమారుడు ఆకాష్ (21) సమీపంలోని కొమ్మలేరు వాగు వద్ద గడ్డి కోస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు శోభ కాలుజారి వాగులో పడిపోయింది. గమనించిన ఆకాష్ తల్లి నీటిలో కొట్టుకుపోవడం చూసి రక్షించేందుకు వాగులోకి దూకాడు. అయితే ఆకాష్‌కు ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. తల్లి శోభ ప్రాణాలతో సమీపంలోని ఓ గట్టుకు చేరింది. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు వాగు వద్దకు వెళ్లి ఆకాష్ మృతదేహాన్ని వెలికి తీసి ఇంటికి తీసుకువచ్చారు. ఆకాష్ ఇటీవలే ఇంజినీరింగ్ పూర్తి చేశాడని, ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకు నీట మునిగి మరణించడంతో కుటుంబ సభ్యులు గుండె పగిలేలా రోదిస్తున్నారు.
నీటిలో దూకిన తనయుడు
ఈత రాక మునిగిపోయి మృతి
శంకరనగరంలో విషాదం
![తల్లిని కాపాడేందుకు... 1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11atk124-240078_mr-1739301598-1.jpg)
తల్లిని కాపాడేందుకు...
Comments
Please login to add a commentAdd a comment