![ఇళ్లు కూల్చివేస్తే రోడ్డున పడతాం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11kvr61-240075_mr-1739301599-0.jpg.webp?itok=PN-KEpmi)
ఇళ్లు కూల్చివేస్తే రోడ్డున పడతాం
విడవలూరు: విడవలూరు గ్రామంలోని బుచ్చి–ఊటుకూరు రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలో ఉన్న గృహాలను ఈనెల 18న తొలగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆర్‌అండ్‌బీ స్థలంలోని ఇళ్లకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. అయితే తమ ఇళ్లను తొలగించవద్దని, ప్రత్యామ్నాయం చూపిన తరువాతే చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన పలువురు మంగళవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఇళ్లు కోల్పోయే వారిలో ఎక్కువ మంది పేద ప్రజలే ఉన్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో మా ఇళ్ల చుట్టూ తిరిగి ఓట్లు అడిగి వేయించుకున్న నాయకులు ఇప్పుడు మేం రోడ్డున పడుతుంటే కనీసం మా తరపున నిలబడి మాకు భరోసా కల్పించకపోవడం దారుణమన్నారు.
విడవలూరు గ్రామస్తుల నిరసన
రోడ్డుపై బైఠాయించిన మహిళలు
Comments
Please login to add a commentAdd a comment