నిందితుడిని కఠినంగా శిక్షించాలి | - | Sakshi
Sakshi News home page

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

Published Mon, Oct 28 2024 12:13 AM | Last Updated on Mon, Oct 28 2024 12:13 AM

నింది

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

రూ.8 కోట్ల భూమి కబ్జా యత్నం
త్వరలోనే నెల్లూరుకు విమానాశ్రయం

ఉదయగిరి మండలం చౌడేపల్లి రెవెన్యూలో ఆక్రమించిన భూమిలో సాగు చేసిన మినుము పంట

ప్రభుత్వ భూముల స్వాహా

ఉదయగిరి: మండలంలోని చౌడేపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సీజేఎఫ్‌ఎస్‌, గండిపాళెం జలాశయం లోతట్టు ప్రాంతాల్లో సుమారు వందెకరాల భూమిని కొంత మంది అక్రమార్కులు ఆక్రమించి దున్ని మినుము, జామాయిల్‌ సాగు చేసే ప్రయత్నాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. జలాశయం లోతట్టు ప్రాంతంలో అత్యంత సారవంతమైన భూములు కావడంతో ఇక్కడ ఏ పంట సాగు చేసినా అధిక దిగుబడితో పాటు మంచి ఆదాయం వచ్చే అవకాశముంది. ఈ ప్రాంతంలో భూమి ఎక్కువ ధర పలుకుతోంది. దీంతో ఈ భూములపై కన్నేసిన అధికార పార్టీకి చెందిన బడా నేతలు ఆక్రమించి యంత్రాల సాయంతో చెట్ల పొదలు తీసి సాగు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొంత భూమిలో మినుము పైరు కూడా సాగు చేశారు. అయితే ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూముల ఆక్రమణ విషయమై స్థానిక విలేకరులు తహసీల్దార్‌ సుభద్ర దృష్టికి తీసుకురాగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని, పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆర్‌ఐ, వీఆర్వోలను ఆదేశించినట్లు ఆమె తెలిపారు.

బరి తెగిస్తున్న భూకబ్జాదారులు

ఉదయగిరి మెట్ట ప్రాంతంలో జాతీయ రహదారులు నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో దుత్తలూరు, ఉదయగిరి, సీతారామపురం మండలాల్లో అధికార పార్టీకి చెందిన కొంత మంది వ్యక్తులు ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపిస్తే అక్కడ రాత్రికి రాత్రే ఆక్రమించి చదును చేసి పంటలు సాగు చేస్తున్నారు. తమకున్న రాజకీయ పలుకుబడితో యథేచ్ఛగా భూములు ఆక్రమిస్తున్నా.. రెవెన్యూ అధికారులు వారి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలున్నాయి. సామాన్యులు సెంటు భూమి ఆక్రమిస్తే ప్రతాపం చూపించే రెవెన్యూ అధికారులు అధికార పార్టీ వ్యక్తుల జోలికి వెళ్లకపోవడంపై సామాన్యుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులకు స్థానికంగా ఫిర్యాదులు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం విశేషం. వారం రోజుల క్రితం ఉదయగిరి మండలంలోని ఆర్లపడియ పంచాయతీలో రాత్రికి రాత్రే సుమారు వందెకరాలు ఆక్రమించి చదునుచేసి భూ ఆక్రమణకు పాల్పడ్డారు. దీనిపై రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. మండలంలో విలువైన, సారవంతమైన భూములు అధికార పార్టీ పెద్దలు ఆక్రమిస్తున్నా రెవిన్యూ అధికారులు నోరుమెదపకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

అధికార మదంతో

బరితెగిస్తున్న తమ్ముళ్లు

ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే వందలాది ఎకరాల భూకబ్జా

దేవదాయ, ప్రభుత్వ భూములను వదలని వైనం

ఒత్తిళ్లతో పట్టించుకోని

రెవెన్యూ అధికారులు

వెంకటాచలంలో రూ.8 కోట్ల

భూమి ఆక్రమణ యత్నం

వరికుంటపాడులో రూ.15 కోట్లు

విలువైన శ్రీమదన వేణుగోపాలస్వామి భూమి కబ్జా

ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు 700 ఎకరాల ఆక్రమణ

ఒక్క మర్రిపాడులోనే 100 ఎకరాలు

జిల్లాలో టీడీపీ తమ్ముళ్లు.. భూచోళ్లుగా అవతరించారు. అధికార మదంతో బరితెగిస్తున్నారు. రూ.వందల కోట్ల విలువైన

వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను కబ్జా

చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక, గ్రావెల్‌, మట్టిని కొల్లగొట్టి రూ.కోట్లు దోచుకున్న ఆ పార్టీ నేతలు, కేడర్‌ ఇప్పుడు ప్రభుత్వ, దేవదాయశాఖ భూములపై రాబందుల్లా పడ్డారు. దేవాలయాలకు పూర్వీకులు, దాతలు ఇచ్చిన భూములకు సంబంధించి ఏకంగా రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి స్వాహా చేస్తున్నారు. ఈ భూముల దోపిడీని అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రతిపక్షాలు రచ్చ చేయడంతో అక్కడ తాత్కాలికంగా బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని చోట్ల భూ ఆక్రమణలను అడ్డుకుంటే.. మరో చోట ఆక్రమిస్తూ రెవెన్యూ అధికారులకు సవాల్‌ విసురుతున్నారు.

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో పచ్చచొక్కాల భూచోళ్లు భూముల చుట్టూ కంచెలు నాటేసి దురాక్రమణ చేస్తున్నారు. ప్రభుత్వ, దేవదాయశాఖ భూములు పచ్చ నేతల కబ్జాకోరల్లోకి చేరుతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో దాదాపు 700 ఎకరాల బీడు భూములను టీడీపీ నేతలు కబ్జా చేసి పంట సాగుకు అనుకూలంగా అభివృద్ధి చేస్తున్నారు. వరికుంటపాడులో టీడీపీ నేతలు ఏకంగా రూ.15 కోట్ల విలువైన శ్రీమదన వేణుగోపాలస్వామి ఆలయ భూముల చుట్టూ కంచె వేసి తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. పత్రికల్లో కథనాలు వచ్చినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. మర్రిపాడులో 80 ఎకరాలు కబ్జాకు టీడీపీ నేతలు యత్నించారు. ఈ విషయమై పత్రికల్లో కథనాలు రావడంతో ఆర్డీఓ వెళ్లి నిషేధిత బోర్డును ఏర్పాటు చేశారు. ఇది ఆగిపోవడంతో అదే మండలం కంపసముద్రంలో సర్వే నంబరు 425, 426, 427లో సుమారు 80 ఎకరాలకుపైగా భూములు టీడీపీ నాయకులు భూ ఆక్రమణలు చేశారు. కదిరినాయుడుపల్లిలో సర్వే నంబరు 67లో 20 ఎకరాలకుపైగా టీడీపీ నేతలు ఆక్రమించారు. కృష్ణాపురం వద్ద నేషనల్‌ హైవే రోడ్డు సమీపంలో రూ.కోటి పైగా విలువ చేసే ఎకరా భూమిని పచ్చనేతలు ఆక్రమించారు.

రూ.15 కోట్ల దేవదాయశాఖ భూమి హాంఫట్‌

ఉదయగిరి నియోజకవర్గంలో వరికుంటపాడు మండలం వేంపాడు రెవెన్యూ సర్వే నంబరు 78/1లో 6.08 ఎకరాల భూమిని పూర్వం ఓ దాత ప్రకాశం జిల్లా పామూరులో ఉన్న శ్రీమదన వేణుగోపాలస్వామి దేవస్థానానికి ఇచ్చారు. 1956 ఫసలీ నుంచి రెవెన్యూ రికార్డుల్లో (ఫేర్‌ అడంగళ్‌లో) శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం పేరుపై భూమి నమోదై ఉంది. దేవదాయ ధర్మదాయశాఖ సెక్షన్‌న్‌ 43 రిజస్టర్‌లో కూడా నమోదైంది. అంటే ఈ భూమి దేవదాయశాఖకు చెందినదే అని అన్నీ రికార్డుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇందులో 3 ఎకరాల భూమిని 2016 అక్టోబరు 28న ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన టీడీపీ నేతలైన పువ్వాడి రాంబాబు, ఆయన బావ కూండ్ల సురేంద్ర జలదంకి మండలం బ్రాహ్మణకాకకు చెందిన పరాంకుశం వెంకట గోపాలాచార్యులు, కుందూరు తిరుపతిరెడ్డి ద్వారా బోగస్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఈ విషయం ఎవరికి తెలియకుండా కొంతకాలంగా గోప్యంగా ఉంచారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాంబాబు, సురేంద్ర అప్పటి తహసీల్దార్‌ చొప్పా రవీంద్రబాబుకు మ్యూటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్‌ రికార్డులు పరిశీలించకుండానే రెవెన్యూ రికార్డులో వారి పేర్లను నమోదు చేశారు. అయితే డిజిటల్‌ కీ రిలీజ్‌ చేయలేదు. ఎన్నికలు జరగడం, వైఎస్సార్‌పీపీ అధికారంలోకి రావడంతో మౌనంగా ఉన్నారు. 2023లో తమ పేర్లు రెవెన్యూ రికార్డులో ఉన్నా, డిజిటిల్‌ కీ వదల్లేదని అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాఽథ్‌కు రాంబాబు, సురేంద్ర వినతిపత్రం ఇచ్చారు. జేసీ ఈ భూమి దేవాలయానికి సంబంధించినదిగా నిర్ధారిస్తూ, వెంటనే రెవెన్యూ రికార్డుల్లో శ్రీమదన వేణుగోపాలస్వామి పేరు నమోదు చేసి, 22ఏ నిషేధ జాబితాలో చేర్చాలని ఆర్‌సీ డీ5.589 పేరుతో 26.10.2023 తేదీన వరికుంటపాడు తహసీల్దార్‌కు ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. అయితే రెవెన్యూ అఽధికారులు రికార్డుల్లో ఆ మార్పులు చేయలేదు.

కల్లూరుపల్లిలో 1.7

ఎకరాలు లేఅవుట్లో కలిపేశారు

నెల్లూరురూరల్‌ నియోజకవర్గంలోని కల్లూరుపల్లి పరిధిలోని సర్వే నంబర్‌ 8లో కల్లూరుపల్లి పెద్ద చెరువు భూమిలో 1.7 ఎకరాలు స్థానిక టీడీపీ నాయకులు ఆక్రమించారు. ఈ భూమిని పక్కనే టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన లేఅవుట్‌ను ఏర్పాటు చేసి చదును చేశారు. సుమారు 60–70 ప్లాట్లును వేశారు. 9 అంకణాల లెక్కన ప్లాట్లను సిద్ధం చేశారు. ఈ స్థలాలను స్థానిక టీడీపీ నాయకులు, అనుచరులు, వర్గీయులకు కట్టబెట్టారు. టీడీపీ నేతల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం వచ్చి 4 నెలలు కూడా గడవకముందే టీడీపీ నేతల తమ అసలు రూపాన్ని చూపిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.

గండిపాళెం జలాశయం

లోతట్టు ప్రాంతాల ఆక్రమణ

మినుము, జామాయిల్‌ సాగుకు సన్నాహాలు

వింజమూరు మండలం కాటేపల్లి, చాకలికొండ, బత్తినవారిపల్లి, ఊటుకూరు, వింజమూరు, తదితర ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో భూములు ఆక్రమణకు గురయ్యాయి. అధికారులు ఇప్పటికై నా చిత్తశుద్దితో వ్యవహరించి పెద్దమొత్తంలో ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

వరికుంటపాడు, దుత్తలూరు, వింజమూరు, కొండాపురం, ఉదయగిరి మండలాలలో మేత పొరంబోకు, అటవీ పొరంబోకు, కొండ పొరంబోకు భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. దుత్తలూరు మండలంలోని బ్రహ్మేశ్వరం సర్వే నంబరు 448/1లో సుమారు వందెకరాలకుపైగా భూములు ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు.

బొంగరాలపాడు రెవెన్యూ పరిధిలో సర్వే నంబరు 69లో సుమారు 250 ఎకరాలకుపైగా ఆక్రమించి మినుము, దోస సాగు చేస్తున్నారు.

గణేశ్వరపురం సర్వే నంబరు 196, 169ల్లో వందెకరాలకుపైగా మేత పోరంబోకు భూములను ఆక్రమించి మెట్టపైర్లు సాగు చేస్తున్నారు. దీనిపై గ్రామస్తులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

వరికుంటపాడు మండలంలోని జడదేవిలో 200 ఎకరాల కొండ పొరంబోకు భూముల్లో నాలుగు రోజుల నుంచి యంత్రాల ద్వారా చెట్లు, ముళ్లపొదలు తొలగించి ఆక్రమించే ప్రయత్నం చేయడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో తాత్కాలికంగా భూ ఆక్రమణలకు బ్రేక్‌ పడింది.

కొండాపురం మండలం లింగనపాళెం సర్వే నంబరు 285, మర్రిగుంటలో 207/1, 217/26, ఉప్పలూరు సర్వే నంబరు 287/1లో సుమారు 800 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఇంత జరుగుతున్నా అధికారులకు మాత్రం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వెంకటాచలం మండలం చవటపాళెం పంచాయతీలో జాతీయ రహదారి అనుకుని ఎరగ్రుంటలో టోల్‌ప్లాజా, అక్షర విద్యాలయం, రవీంద్రభారతి స్కూల్‌కు మధ్యలో సర్వే నంబరు 583లో 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి (ఎరగ్రుంట) ఉంది. ఈ ఎరగ్రుంటలో ఎప్పుడూ నీళ్లు ఉండడంతో పశువులకు ఎండా కాలంలో ఇక్కడే సేద తీరేవి. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ నేతల కన్ను విలువైన ఎరగ్రుంటపై పడింది. అనుకున్నదే తడువుగా రాత్రికి రాత్రే జేసీబీతో సుమారు 4 ఎకరాల మేరకు గుంటను పూడ్చి కబ్జాకు పాల్పడ్డారు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి ధర సుమారు రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన రూ.8 కోట్లు ఉంటుందని అంచనా. భూ కబ్జా వెలుగులోకి రావడంతో తమ్ముళ్లు వెనకడుగేశారు.

ఇదే మండలం గొలగమూడిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ జరిగిన మరుసటి రోజే ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల కోసం కేటాయించిన 1.25 ఎకరాల భూమిని టీడీపీ నేత దౌర్జన్య పూరితంగా ఆక్రమించాడు. ఈ భూ ఆక్రమణను ఆశ్రమ గిరిజన పాఠశాల ఉపాధ్యాయినులు అడ్డుకోబోతే వారిని సైతం బెదిరించారు. ప్రస్తుతం అతని అధీనంలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
నిందితుడిని కఠినంగా శిక్షించాలి1
1/1

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement