నెల్లూరు (టౌన్): విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామాలయ, సార్డ్స్, ఎన్జీఓ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ వరకు గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ ఉషారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల హెచ్‌ఎంలు, సిబ్బంది జయప్రదం చేయాలన్నారు. క్యాంపెయిన్‌లో మొదటగా 1800–123–6848 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు. వాట్సప్ నంబరుకు ఒక రిజిస్ట్రేషన్ లింక్ వస్తుందని చెప్పారు. ఆ లింక్‌ను క్లిక్ చేసి అందులో పాఠశాల, హెచ్‌ఎం పేర్లు, మొబైల్ నంబరు, స్కూల్ మెయిల్ ఐడీ, పాఠశాల విద్యార్థుల సంఖ్య తదితర వివరాలను పూర్తి చేయాలన్నారు. ఆ తరువాత మరో లింకు వస్తుందని, అందులో స్కూల్ నుంచి కొంతమంది విద్యార్థులతో హ్యాండ్ వాష్ చేసిన ఫొటో ఒకటి అప్‌లోడ్ చేయాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక డిజిటల్ సర్టిఫికెట్ వస్తుందని, స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ పోటీలకు ఉపయోగపడుతుందన్నారు.
రేపు వెటరన్ మాస్టర్
అథ్లెటిక్స్ ఎంపికలు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లా వెటరన్ మాస్టర్ క్రీడాకారుల ఎంపికలను ఈ నెల 17వ తేదీ ఉదయం 10 గంటలకు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఆ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఈ.భాస్కర్‌రెడ్డి, బసవయ్య శుక్రవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు 30–80 ఏళ్ల లోపు సీ్త్ర, పురుషులు అర్హులన్నారు. 100, 400, 800, 1,500, 5,000 మీటర్ల పరుగు పందాలు, హైజంప్, లాంగ్ జంప్, షార్ట్‌ఫుట్, డిస్కర్స్ త్రో, జావెలిన్‌త్రో, హేమర్‌త్రో, 5 కి.మీ. నడక పోటీల్లో ఎంపికలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల వారు వయస్సు ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజు ఫొటోలతో హాజరు కావాలన్నారు. ఎంపికై న అథ్లెట్స్ డిసెంబర్ 14, 15 తేదీల్లో కృష్ణా జిల్లా గుడివాడలో జరిగే ఆంధ్రప్రదేశ్ వెటరన్ మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారన్నారు.
జిల్లా అంతటా వర్షాలు
● సగటు వర్షపాతం 27.5 మి.మీ.
నెల్లూరు (అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజులుగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం కొన్ని మండలాల్లో భారీ వర్షాలు కురవగా మిగతా మండలాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా గుడ్లూరు మండలంలో 101.4 మి.మీ. వర్షం కురిసింది. అత్యల్పంగా అనంతసాగరంలో 5.4 మి.మీ. వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షం 27.5 మి.మీ.గా నమోదైంది. ఉలవపాడు మండలంలో 70.6, కందుకూరు 54.6, వలేటివారిపాళెం 51.8, పొదలకూరు 46.2, ముత్తుకూరు 45.6, వరికుంటపాడు 39.2, దగదర్తి 38.2, జలదంకి 37.8, కావలి 37.2, మనుబోలు 35.4, బోగోలు 35.0, లింగసముద్రం 31.4, దుత్తలూరు 28.8, సీతారామపురం 28.0, ఇందుకూరు పేట 26.8, అనుమసముద్రంపేట 25.4, కొడవలూరు 22.8, విడవలూరు 22.6, కోవూరు 21.4, సంగం 20.2, నెల్లూరు రూరల్ 18.6, అల్లూరు 18.4, తోటపల్లిగూడూరు 17.8, నెల్లూరు అర్బన్ 17.4, రాపూరు 17.2, కలిగిరి 17.0, వింజమూరు 16.2, ఉదయగిరి 14.6, కలువాయి 14.0, మర్రిపాడు 13.4, వెంకటాచలం 12.6, బుచ్చిరెడ్డిపాళెం 11.6, ఆత్మకూరు 8.8, కొండాపురం 7.2, సైదాపురం 7.2, చేజర్లలో 6.2 మి.మీ. కురిసింది.
నేడు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడి జిల్లా పర్యటన
నెల్లూరు రూరల్: రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్‌నాయక్ శనివారం జిల్లాలో పర్యటించనున్నట్లు సమాచార పౌరసంబంధాలశాఖ డీడీ సదారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన ఉదయం 9 గంటలకు నెల్లూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గిరిజనులు, గిరిజన సంఘాల నుంచి వినతులు స్వీకరించి, వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఉదయం 10.45 గంటలకు కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల విద్యార్థినులతో సమావేశమవుతారు. మధ్యా హ్నం 2 గంటలకు నెల్లూరు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో కలెక్టర్, ఎస్పీలతో సమావేశమవుతారు. సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఉంటుందని పేర్కొన్నారు.
మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రంలో చోరీ
● రూ.3.50 లక్షలు మాయం
గుడ్లూరు: గుడ్లూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రంలో రూ.3.50 లక్షల చోరీ జరిగిందని నిర్వాహకులు కె.వెంకటేష్ శుక్రవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం మధ్యాహ్నం సమయంలో భోజనానికి ఇంటికి వెళ్లే సమయంలో షాపు మూత వేయకుండా వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి షాపు కౌంటర్‌లో నగదు కనిపించ లేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ టీవీ ఆధారంగా అనుమానితులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment