నెల్లూరు(క్రైమ్): భార్యతో గొడవల కారణంగా మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులోని శ్రామిక నగర్‌లో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. శ్రామిక గనర్‌కు చెందిన దిలీప్ కుమార్ (25), స్వప్నకు రెండేళ్ల క్రితం వివాహమైంది. భార్య పొగతోటలోని ఓ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తోంది. భర్త వివిధ పనులు చేసేవాడు. కొంతకాలం వారి కాపురం సజావుగా సాగింది. అనంతరం దంపతుల నడుమ విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం స్వప్న డ్యూటీకి వెళ్లింది. దిలీప్ కుమార్ తన ఇంట్లోనే సెల్‌ఫోన్‌తో వీడియో తీస్తూ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఇంటికి వచ్చిన స్వప్న భర్త మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైంది. ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు తెలియజేసింది. బాధిత తల్లి చంద్రమ్మ వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ కిశోర్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment